లుక్ మార్చేసిన గూగుల్ మెసేజెస్.. కొత్త ఫీచర్లు ఇవే..

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ గూగుల్ మెసేజెస్ తాజాగా తన లోగో డిజైన్‌ను మార్చింది.

దానితో పాటు కొన్ని కొత్త ఫీచర్‌లను పరిచయం చేసింది.వాటిలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఒకటి.

ఇప్పుడు గూగుల్ మెసేజెస్ తన యాప్‌లో గ్రూప్‌లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ పద్ధతిని టెస్ట్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది వినియోగదారులకు అందుబాటులో ఉంది.గూగుల్ మెసేజెస్ ఇప్పటికే ప్రైవేట్ మెసేజ్‌ల కోసం E2e పద్ధతిని ఆఫర్ చేసింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్ I/O 2022లో గ్రూప్ చాట్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని గూగుల్ హామీ ఇచ్చింది.

గూగుల్ మెసేజెస్ వెబ్‌ వెర్షన్‌లో దాని ఐకాన్ కోసం యానిమేటెడ్ స్ప్లాష్ స్క్రీన్‌ను గూగుల్ తీసుకొచ్చింది.

గూగుల్ మెసేజెస్‌లో ఫలానా టైమ్‌ షెడ్యూల్ చేయడం చాలా ఈజీ.యాప్ ఇప్పుడు భారతదేశంలోని యూజర్ల కోసం బిజినెస్ మెసేజెస్‌ను అందిస్తోంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, మెసేజ్‌ల యాప్‌లో ప్రకటనలు వచ్చాయని ప్రజలు ఫిర్యాదు చేశారు.

గూగుల్ ఈ యాడ్స్ నిలిపివేయాలని నిర్ణయించగా ఇప్పుడు ఇలాంటి యాడ్స్ కనిపించడం లేదు.

"""/"/ ఈ యాప్ లార్జ్ ఫైల్‌లు, హై-రిజల్యూషన్ ఫొటోలను షేర్ చేయడానికి అనుమతిస్తుంది.

చాట్ ఫీచర్లను ఎనేబుల్ చేసినప్పుడు.వైఫై మొబైల్ డేటా ద్వారా రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రోటోకాల్‌ని ఉపయోగించి మీ మెసేజెస్‌ను పంపొచ్చు.

ఇంకా గూగుల్ మెసేజెస్ యాప్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ కంటే ఎక్కువ ఫీచర్లు కూడా ఉన్నాయి.

వాట్సాప్ ఎక్కువగా వాడేవారు దీన్ని ఆల్టర్నేటివ్‌గా వాడుకోవచ్చు.

దగ్గును కేవలం 2 రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!