జీ బోర్డు లో మరో సూపర్ ఫీచర్… టెక్ట్స్ ఇమేజ్ రూపంలోకి!

జీ బోర్డు అనేది ఆండ్రాయిడ్‌, IOS డివైజ్‌ల కోసం గూగుల్ డెవలప్‌ చేసిన వర్చువల్ కీబోర్డ్ యాప్ అనే సంగతి అందరికీ తెలిసినదే కదా.

ఇక ఇది 2016 మే నెలలో IOS ప్లాట్‌ఫారంకు, 2016 డిసెంబర్‌లో ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు అందుబాటులోకి వచ్చింది.

అప్పటికే ఆండ్రాయిడ్‌లో ఉన్న గూగుల్ కీబోర్డ్ యాప్‌కి మేజర్‌ అప్‌డేట్‌గా ఈ వర్చువల్‌ కీబోర్డ్‌ యాప్‌ వచ్చింది.

అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్‌లకు జీ బోర్డు లో టెక్స్ట్-టు-ఇమేజ్ జెనరేటర్ ఇమేజెన్‌ ఇంటిగ్రేట్ చేయడానికి గూగుల్‌ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

"""/"/ గూగుల్ ఇటీవల APK (ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్)లో జీ బోర్డు తాజా బీటా వెర్షన్ 12.

7.05.

507749191లో ఇమేజెన్ కీబోర్డ్‌ని సూచించే కోడ్ లైన్‌లను గుర్తించి, జీబోర్డ్‌కి ఇమేజెన్‌ టెక్నాలజీని ఇంట్రిగేట్ర్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుసుకొంది.

కాగా ఇది OpenAI కంపెనీ అభివృద్ధి చేసిన ప్రముఖ ఇమేజ్ జనరేటర్ DALL-E 2ని పోలి ఉండడం గమనార్హం.

దీనికి సబ్మిట్‌ చేసిన రిక్వెస్ట్‌ల ఆధారంగా ఇమేజెస్‌ని క్రియేట్‌ చేస్తుంది.అయినప్పటికీ గూగుల్ సెర్చ్‌ ఫలితాల మేరకు.

ఎక్కువ మంది వ్యక్తులు DALL-E ఫలితాల కంటే ఇమేజెన్ రిజల్ట్‌ను ఇష్టపడుతున్నారు. """/"/ ఇకపోతే వ్యాపారస్తులు తమ బ్రాండింగ్, మార్కెటింగ్ పబ్లిసిటీ కోసం అనుకూల ఇమేజెస్‌ని రూపొందించడానికి ఇమేజెన్‌ టెక్నాలజీతో జీ బోర్డుని సునాయాసంగా వినియోగించవచ్చు.

ఇది క్రియేటివిటీ, కస్టమైజేషన్‌ కొత్త స్థాయిని అందిస్తుంది.ఈ ఇంటిగ్రేషన్‌ జీ బోర్డుని సోషల్ మీడియాలో మరింత శక్తివంతమైన టూల్‌గా మారుస్తుంది.

కస్టమైజ్డ్‌ ఇమేజ్‌లను త్వరగా, సులభంగా క్రియేట్ చేయగల, షేర్‌ చేయగల సామర్థ్యం ఎక్కువ మంది యూజర్లను ఆకర్షిస్తుంది.

జీ బోర్డు లో ఇమేజెన్ టెక్నాలజీని చేర్చడం ఇంకా అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు.

రాబోయే వెర్షన్‌లో ఈ అప్‌డేట్‌ అందిస్తారనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావలసి ఉంటుంది.

రీల్స్ పిచ్చి తగలెయ్య.. సైన్‌బోర్డుపై ఆ పనేంటి బ్రో..