గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే..?
TeluguStop.com
ఎలక్ట్రిక్ వాహనదారులు దూర ప్రయాణాలు చేసే సమయంలో చార్జింగ్ స్టేషన్లు( Charging Stations ) ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్యకు గూగుల్ మ్యాప్స్( Google Maps ) చక్కటి పరిష్కారాన్ని చూపించనుంది.
గూగుల్ లో తాజాగా గూగుల్ మ్యాప్స్కి అనే కొత్త ఫీచర్లు జోడించారు.ఈ ఫీచర్ ఎలక్ట్రిక్ కార్లను చార్జ్ చేయడానికి చార్జింగ్ స్టేషన్లో ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడం సులభతరం చేస్తుంది.
ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ లో పెట్రోల్ బంకులను ఎలా చూపిస్తుందో, అలాగే త్వరలోనే గూగుల్ మ్యాప్స్ లో చార్జింగ్ స్టేషనులను చూపించనుంది.
మన భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.దీంతో చార్జింగ్ స్టేషన్లో సంఖ్య కూడా పెరుగుతోంది.
"""/" /
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల( Electric Cars ) కోసం చార్జింగ్ స్టేషన్లను కనుక్కోవడం చాలా పెద్ద పని.
అయితే త్వరలోనే గూగుల్ మ్యాప్ లో వచ్చే సరికొత్త ఫీచర్ వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే.
AI సహాయంతో వినియోగదారుల రివ్యూలను తీసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల లోకేషన్ ను గూగుల్ మ్యాప్ చూపిస్తుంది.
గూగుల్ మ్యాప్స్ మొదటగా ఇన్ బిల్ట్ వాహనాలకు ఈ సదుపాయాన్ని అందించనుంది. """/" /
ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ స్థాయి తగ్గుతున్నట్లు కనిపించిన వెంటనే ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లకు సంబంధించిన సమాచారం కారు డిస్ ప్లే లో కనిపిస్తుంది.
ఈ ఫీచర్ తోలుతా అమెరికాలో అందుబాటులోకి రానుంది.ఆ తర్వాత భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉండే ఇతర దేశాలలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనదారులు సుదూర ప్రాంతాలలో సంతోషంగా ప్రయాణం చేయవచ్చు.
ఆలయ పురోహితునికి దక్షిణగా 500 నోట్ల కట్ట ఇచ్చిన రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?