గూగుల్‌ మ్యాప్‌లో ఇక టోల్‌ ధరలు కూడా..!

ఈరోజుల్లో గూగుల్‌ మ్యాప్‌తో వేల కిలోమీటర్లు సైతం ప్రయాణం చేస్తున్నాం.ఇంతటి గొప్ప సేవలందిస్తున్న గూగుల్‌ త్వరలో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఆ వివరాలు తెలుసుకుందాం.మీరు రోడ్డు ప్రయాణం చేసేటపుడు కేవలం రూట్‌ మ్యాప్‌ను అందిస్తున్న గూగుల్‌ ఇక పై ఆ దారిగుండా ఉండే టోల్‌గేట్‌ రుసుము, ఇతర చార్జీలను కూడా మనకు అందుబాటులో ఉంచనుంది.

ప్రపంచవ్యాప్తింగా ఎంతో మంది ఉపయోగిస్తున్న ఈ యాప్‌ ఎంతో మందికి దారిని చూపిస్తూ ఆకట్టుకుంటోంది.

ఇక కొత్త టోల్‌ ధరల ఫీచర్‌ త్వరలో మరింత బెస్ట్‌ అనుభవాన్ని అందించనుంది.

ఈ ఫీచర్‌ ద్వారా ప్రయాణీకులు ఏ దారి గుండా వెళ్లలో ముందుగానే డిసైడ్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం కేవలం టోల్‌ గేట్లను మాత్రమే చూపిస్తున్న గూగుల్‌ మ్యాప్‌ వాటి ధరలు ఇతర వివరాలను పొందపరచలేదని ఆండ్రాయిడ్‌ పోలీస్‌ తెలిపింది.

అధికారిక వివరాల ప్రకారం ఈ ఫీచర్‌ను గూగుల్‌ మ్యాప్‌ ప్రీవ్యూకు పంపినట్లు తెలుస్తోంది.

దీంతో త్వరలో ఈ ఫీచర్‌ అందుబబాటులోకి రానుందని తేలిపోయింది.ఇక టోల్‌ ధరలతోపాటు ఇతర వివరాలను కూడా సులభంగా పొందవచ్చు.

ఈ ఫీచర్‌తో గూగుల్‌ మ్యాప్‌ వినియోగదారులు ముందుగానే వారు డ్రైవ్‌ చేస్తున్న మార్గానికి సంబంధించిన ధరలను ముందుగానే డిస్‌ప్లే అవుతుందని, కానీ ఇది ఎప్పుడు అందుబాటులోకి రానుందో ప్రస్తుతం తెలియదని ఆండ్రాయిడ్‌ పోలీస్‌ తెలిపింది.

ఈ ఫీచర్‌ కేవలం వినియోగదారులు ఎంచుకున్న ప్రాంతాలకే వర్తిస్తుందా? ఇతర మార్గాలకు కూడా నా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం టోల్‌ ఛార్జీలను అధిగమించాలంటే ఈ కింది వివరాలతో మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు.

"""/"/ ముందుగా స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ మ్యాప్‌ను ఓపెన్‌ చేయాలి.అందులో మన డెస్టినేషన్‌ వివరాలు నమోదు చే సి, సెర్చ్‌ చేయాలి.

గూగుల్‌ యాప్‌ డైరెక్షన్‌ బటన్‌పై ట్యాప్‌ చేయాలి.అప్పుడు స్క్రీన్‌లో పైన ఉన్న యువర్‌ లొకేషన్‌ దగ్గర ఉన్న మూడు చుక్కలను క్లిక్‌ చేయాలి.

అప్పుడు మళ్లీ రూట్‌ ఆప్షన్స్‌పై క్లిక్‌ చేయాలి.ఆ తర్వాత గూగుల్‌ ఓ మెనూను ఓపెన్‌ చేస్తుంది.

అందులో అవాయిడ్‌ టోల్స్‌ బాక్స్‌పై టిక్‌ చేయాల్సి ఉంటుంది.అప్పుడు మీరు వెళ్తున్న మార్గాల్లో ఉండే హైవేలతోపాటు నీటి మార్గాలను కూడా నివారించడం కూడా ఈ మెనూ ద్వారా ఎంచుకోవచ్చు.

చివరగా డన్‌ పై క్లిక్‌ చేసి, కిందివైపు ఎడమపక్క ఉన్న స్టార్ట్‌ బటన్‌ను ఎంచుకోవాలి.

జైపూర్ లో మంచు మనోజ్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో