మరో సరికొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్న గూగుల్..!

ప్రముఖ గూగుల్ సంస్థ ఈ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది.

అదేంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు.ఈ మధ్య షార్ట్ వీడియోస్, టిక్ టాక్ వీడియోస్ బాగా ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఈ వీడియోలను చూడడానికి మనం ఆ ప్రత్యేక యాప్ లో మాత్రమే చూసేవాళ్ళము.

ఇక మీదట అలా చూడవలిసిన పని లేదు.గూగుల్ తీసుకువచ్చే ఈ సరి కొత్త ఫీచర్ లో భాగంగా ఇన్‌స్టాగ్రాం, టిక్‌ టాక్‌ షార్ట్ వీడియోలను గూగుల్ సెర్చ్ లో తీసుకొని రావడానికి సన్నాహాలు చేస్తుంది.

అంటే ప్రస్తుతం సెర్చ్‌ రిజల్ట్‌ లో మనకు కావలిసిన అంశాన్ని సెర్చ్ చేస్తాము కదా.

అలా కనిపించే వెబ్‌ సైట్‌ ల జాబితాపైన షార్ట్ వీడియోలు కనిపించేలా ఈ ఫీచర్ తీసుకురానున్నారు.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంకా టెస్టింగ్ దశలో ఉంది.ఇది విజయవంతం అయితే రానున్న కొద్ది రోజుల్లోనే గూగుల్ యూజర్లు అందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం గూగుల్ తీసుకొస్తున్న ఈ షార్ట్ వీడియో ఫీచర్ అనేది గతంలో తీసుకొచ్చిన గూగుల్ స్టోరీస్‌ కు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.

ఈ క్రమంలో ఇప్పటి వరకు కేవలం యూట్యూబ్‌, టాంగీ, ట్రెల్‌ ల నుంచి మాత్రమే షార్ట్‌ వీడియోలను మాత్రమే గూగుల్ తీసుకునేవారు.

"""/"/ కానీ ఇకమీదట తాజాగా వచ్చిన ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రాం, టిక్‌ టాక్‌ ల షార్ట్‌ వీడియోలు కనిపించేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇంకో విశేషం ఏంటంటే.ఈ వీడియోలను క్లిక్ చేస్తే కేవలం వెబ్‌వెర్షన్‌ లో మాత్రమే ఓపెన్ అవుతాయి.

యాప్స్ ఓపెన్ కావు.దానివల్ల యూజర్ యాప్‌ లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదని గూగుల్ భావిస్తోందట.

మరి ఈ సారి కొత్త ఆప్షన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు..!!