లోన్ యాప్స్ కు చెక్ పెట్టిన గూగుల్.. ఎన్నీ యాప్స్ బ్యాన్ చేసిందంటే..?

కరోనా వచ్చినప్పటి నుంచి దాదాపుగా 90% లావాదేవీలు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి.టెక్నాలజీ( Technology ) అభివృద్ధి చెందిన క్రమంలో అందరూ కూడా ఆన్లైన్లోనే కార్యకలాపాలు సాగించడంలో ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆన్లైన్లో కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి.కానీ అందులో ఏ యాప్స్ మంచివి, ఏ యాప్స్ మోసపూరితమైనవి అనే విషయం తెలియక ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు.

రోజురోజుకు ఈ యాప్స్ బారినపడి బలి అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

ప్రస్తుతం అటువంటి యాప్స్ పై దృష్టి పెట్టింది గూగుల్( Google ).ఈ యాప్స్ లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లోన్ యాప్స్ గురించే.

ఎందుకంటే యువతను టార్గెట్ చేసి లోన్ యాప్స్ ఇష్టానుసారంగా లోన్స్ ఇచ్చి ఆ తర్వాత వేధింపులకు గురి చేస్తున్నాయి.

"""/" / స్టూడెంట్స్, బ్యాచిలర్స్ పాకెట్ మనీ కోసం, ఇతర అవసరాల కోసం లోన్ యాప్ లో డబ్బులు తీసుకుని తర్వాత చెల్లిద్దాం అని భావిస్తున్నారు.

కానీ వారికి తెలియదు లోన్ యాప్స్( Loan Apps ) డబ్బు తిరిగి చెల్లించకుంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తాయో.

ఈ మధ్యన చాలా సార్లు వినే ఉంటాం.లోన్ యాప్ లో డబ్బులు తీసుకుని అధిక వడ్డీ రేట్లు కట్టలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న గూగుల్ మోసపూరిత యాప్ లను బ్యాన్ చేయాలని నిర్ణయించుకుంది.

గూగుల్ ప్లే స్టోర్ పాలసీని ఉల్లంఘించినందుకు దాదాపుగా 3500 లోన్ యాప్స్ ను బ్యాన్ చేసింది.

గత కొన్ని రోజులుగా గూగుల్, లోన్ యాప్స్ ను పర్యవేక్షించి.మోసపూరిత లావాదేవీలు జరిపి యూజర్ల నుండి కోట్ల రూపాయలు లోన్ యాప్స్ కొట్టేశాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ లోన్ యాప్స్ కు యువత బలికాకుండా ఉండడం కోసం వాటిని బ్యాన్ చేసేసింది.

వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!