ఏఐ పవర్డ్ ‘ప్రూఫ్రీడ్’ గురించి విన్నారా? ఇక వారు సర్దుకోవాల్సిందే!

ఇంటర్నెట్ ప్రపంచంలో ఏఐ ( Artificial Intelligence) అనేది పెను సంచలంగా చెప్పుకోవచ్చు.

దాదాపు ఒక సంవత్సర కాలంగా ఇది సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారుతోంది.

నేడు ఈ కృత్రిమ ఆధారిత సేవలను చాలా రంగాల్లో వినియోగించుకుంటున్నారు.ఇక తాజాగా గూగుల్ ఏఐ ఆధారిత ఫీచర్లకు శ్రీకారం చుట్టింది.

జీబోర్డ్కు తాజాగా 'ప్రూఫ్రీడ్' పేరిట ఒక ఆప్షన్ను జతచేసే పనిలో పడింది.ఇప్పుడు ఉన్న ఆటోకరెక్ట్ స్థానంలో ఇది వస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం ఈ ఆప్షన్ బేటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. """/"/ అవును, 13.

4 వెర్షన్లో జీబోర్డ్ బేటా వెర్షన్( Gboard Beta Version )లో ఆండ్రాయిడ్పై ఇది కనిపిస్తుంది.

కీబోర్డ్ టూల్బార్పై దీన్ని అమర్చడం విశేషంగా చెప్పుకోవచ్చు.స్పెల్లింగ్, గ్రామర్ తప్పిదాలను చెక్ చేసుకునేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

'9టు5గూగుల్'( 9To5 Google ) ప్రకారం ఫిక్స్ ఇట్ ప్రాంప్ట్తో పిక్సెల్ ఫోల్డ్లో ఇది ఉంటుంది.

జనరేటివ్ ఏఐకి సంబంధించి గూగుల్ సాధారణ సింబల్ మాదిరిగానే దీన్ని తీసుకు వచ్చింది.

ఈ ఆప్షన్ను క్లిక్ చేస్తే పాపప్ ఒకటి వస్తుంది.ప్రూఫ్రీడింగ్ ఎలా పనిచేస్తుందో చెబుతుంది.

"""/"/ దీనికోసం వినియోగదారులు జీబోర్డ్ టూల్బార్పై ప్రూఫ్రీడ్ ఆప్షన్( Proof Read )ను టాప్ చేయవలసి వుంటుంది.

ఆ తరువాత అది గ్రామర్, స్పెల్లింగ్ తప్పులను( Spelling Mistakes ) సూచిస్తుంది.

తద్వారా ఫిక్సెట్ బటన్ ద్వారా ఆటోమేటిక్గా కరెక్షన్స్ జరుగుతాయి.ఇంకో విషయం ఏమిటంటే, స్టిక్కర్లను సృష్టించేందుకు టోన్ ఫీచర్ సహా పలు ఎఐ ఆధారిత ఫీచర్లను గూగుల్ అభివృద్ధి చేస్తోందని విశ్వసనీయ సమాచారం.

మొత్తంగా ఏఐ ప్రస్తుతం రాజ్యమేలుతున్న వేళ గూగుల్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ని తీసుకు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

కాగా ఈ విషయమై నెటిజన్లు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఫీచర్ కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు.

మహేష్ బాబును టార్గెట్ చేయడం ఎంతవరకు రైట్.. ఇంతలా టార్గెట్ చేయాలా?