సరికొత్త ఫీచర్ తో గూగుల్ డాక్స్ ..!

టైపింగ్, డాక్యుమెంటేషన్ కోసం నిత్యం లక్షలాది మంది ఉపయోగించే ప్రముఖ యాప్ లలో గూగుల్‌ డాక్స్‌ కూడా ఒకటి.

ఇప్పటికే చాలా మందికి ఫేవరేట్ యాప్‌గా మారిన గూగుల్‌ డాక్స్.ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో మరింత మందిని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా టెక్స్ట్ వాటర్‌మార్క్ అనే ఓ కొత్త ఫీచర్‌ను గూగుల్ డాక్స్‌కు విడుదల చేసింది గూగుల్.

ఈ ఫీచర్ తో యూజర్లు తమ డాక్యుమెంట్స్ లోని ప్రతి పేజీలో తమ టెక్స్ట్ తో కూడిన వాటర్‌మార్క్‌ను జత చేయవచ్చు.

ఏదైనా డాక్యుమెంట్ ను షేర్ చేయడానికి ముందు.ఆ డాక్యుమెంట్ యొక్క స్టేటస్ తెలియజేయడానికి ఈ 'కాన్ఫిడెన్షియల్' లేదా 'డ్రాఫ్ట్' వంటి టెక్స్ట్ వాటర్‌మార్క్‌లను తయారుచేసి ప్రతి పేజీలోనూ యాడ్ చేయవచ్చు.

ఈ ఆప్షన్‌ గూగుల్ డాక్స్ లోని ఇన్‌సర్ట్‌ మెనూ లో మనకు కనిపిస్తుంది.

గూగుల్.ప్రతి యూజర్ కి గూగుల్ డాక్స్ వాటర్‌మార్క్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.

మరికొద్ది రోజుల్లో ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.యూజర్లు తమ డాక్యుమెంట్లకు కంపెనీ లోగోలు, బ్రాండింగ్ వంటివి యాడ్ చేయడానికి ఈ కొత్త ఫీచర్ సహకరిస్తుంది.

"""/"/ అయితే గూగుల్ డ్రైవ్‌లో వచ్చిన కొత్త అప్‌డేట్‌తో యూజర్లు డేంజరస్ ఫైల్స్ ను ఓపెన్ చేసేటప్పుడు మనం వార్నింగ్ ని చూడొచ్చు.

ఇది గూగుల్ డ్రైవ్‌, గూగుల్ డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, డ్రాయింగ్‌ల యూజర్లకు కూడా విడుదలయ్యింది.

తాజాగా డాక్యుమెంట్లలో టేబుల్స్‌ను కస్టమైజ్ చేయడానికి అనేక కొత్త మార్గాలను గూగుల్ జోడించిందని గూగుల్ కంపెనీ బ్లాగ్ పోస్ట్ వెల్లడించింది.

దీని ద్వారా యూజర్లు ఇప్పుడు టేబుల్‌ లోని ఒక నిలువు వరుసను లేదా అడ్డు వరుసను పిన్ చేయవచ్చు.

కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లు యూజర్లకు మరింత సౌకర్యంగా ఉండనున్నాయి.

ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!