గూగుల్‌లో మీ సెర్చ్‌లను ఇలా సులభంగా డిలీట్‌ చేసుకోవచ్చు!

గూగుల్‌లో మీ సెర్చ్‌లను ఇలా క్విక్‌ డిలీట్‌ చేసుకోవచ్చు!

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిశీలిస్తుంది సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం గూగుల్‌.ప్రతిరోజూ ఏదో ఒక నయా ఫీచర్‌ను అందుబాటులోకి తీసురానున్న వార్తలు వస్తూనే ఉంటాయి.

గూగుల్‌లో మీ సెర్చ్‌లను ఇలా క్విక్‌ డిలీట్‌ చేసుకోవచ్చు!

ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలతో తమ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం ప్రారంభంలో గూగుల్‌ క్విక్‌ డిలీట్‌ ఫీచర్‌ను ప్రకటించింది.

గూగుల్‌లో మీ సెర్చ్‌లను ఇలా క్విక్‌ డిలీట్‌ చేసుకోవచ్చు!

అంటే, ఇకపై గత 15 నిమిషాల సెర్చ్‌ను కూడా డిలీట్‌ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది గూగుల్‌.

ప్రస్తుతం క్విక్‌ డిలీట్‌ను ఐఓఎస్‌ యూజర్లపై పరీక్షిస్తుంది.ఆటో డిలీట్‌ ఆప్షన్‌కు ఎక్స్‌టెన్షన్‌గా ఈ ఫీచర్‌ను గత సంత్సరం ప్రకటించింది.

దీని ద్వారా గత 15 నిమిషాల్లో సెర్చ్‌ చేసిన గూగుల్‌ హిస్టరీని డిలీట్‌ చేసే ఫీచర్‌ను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.

"""/"/ – ఈ ఫీచర్‌ను వాడటానికి గూగుల్‌ అకౌంట్‌లో మెనూ ఆప్షన్‌లోకి వెళ్లాలి.

– అప్పుడు మీ అవతార్‌ ప్రోఫైల్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.– అప్పుడు క్విక్‌ డిలీట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

అందులో చివరి 15 నిమిషాలు అని కనిపిస్తుంది.– ఆ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసి హిస్టరీని డిలీట్‌ చేయవచ్చు.

ఇదేవిధంగా గూగుల్‌ వినియోగదారులు వాయిస్‌ కమాండ్‌ ద్వారా డిలీట్‌ చేయవచ్చు.గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా ‘ హే గూగుల్‌ , డిలీట్‌ ఎవరీథింగ్‌ ఐ సెడ్‌ టూ యూ లాస్ట్‌ వీక్‌’ అంటే సరిపోతుంది.

లేదా ఆటో డిలీట్‌ ఆప్షన్‌ ద్వారా కూడా డిలీట్‌ చేయవచ్చు.అంటే ఇందులో 3,18, 36 నెలలు అనే ఆప్షన్‌ ఉంటుంది.

వినియోగదారులు మై యాక్టివిట్‌ సెక్షన్‌ ఆప్షన్‌ను సెట్టింగ్‌ టై అల్టర్‌ ద్వారా కూడా డిలీట్‌ చేయవచ్చు.

ఆటో డిలీట్‌ ఆప్షన్‌ ద్వారా ఆటోమెటిక్‌గా గూగుల్‌ సెర్చ డిలీట్‌ అయిపోతాయి.దీనికి మీ గూగుల్‌ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేడ్‌ చేస్తుండాలని గూగుల్‌ బ్లాగ్‌ ద్వారా తెలిపింది.

అయితే, క్విక్‌ డిలీట్‌ ఆప్షన్‌ ద్వారా చివరి 15 నిమిషాల సెర్చ్‌ హిస్టరీని కేవలం ఒక ట్యాప్‌ ద్వారా తొలగించవచ్చు.

ఈ గూగుల్‌ యాప్‌ ఫీచర్‌ ఐఓఎస్‌ మొబైల్‌ యూజర్లకు అందుబాటులో ఉంది.అతి త్వరలో గూగుల్‌ యాప్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

ఈ విధంగా మీ గూగుల్‌ సెర్చ్‌ను ఈజీగా డిలీట్‌ చేసుకోవచ్చు.

ఉగాది పూజలో మెరిసిన చిరంజీవి మనవరాలు.. వైరల్ అవుతున్న క్లీంకార ఫోటోలు!

ఉగాది పూజలో మెరిసిన చిరంజీవి మనవరాలు.. వైరల్ అవుతున్న క్లీంకార ఫోటోలు!