సిరివెన్నెలకు గూగుల్ ఘన నివాళి..!

తెలుగు సాహిత్యానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వారిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు.

ఆయన పాట రాశాడంటే దాన్ని అర్ధం చేసుకోవాలనే ఆలోచన శ్రోతలకు పెరిగేది.అంతటి మహా కవి, రచయిత సిరివెన్నెల మన మధ్య లేరు అన్నది జీర్ణించుకోవడం కష్టమే.

సినీ పరిశ్రమని.తనని అభిమానించే కోట్ల మంది అభిమానులను శోక సముద్రంలో ముంచి ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఆయన మరణం తెలుగు సినీ సాహిత్యానికి తీరని లోటు.సిరివెన్నెలని ఆఖరి చూపు కోసం సినీ పరిశ్రమ ప్రముఖులందరు వచ్చారు.

ఇక అంతటి గొప్ప కళా రచయితకు గూగుల్ కూడా నివాళులు అర్పించింది.సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం.

సీతారామశాస్త్రి గారి సాన్నిహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది.

అంతేకాదు ఓకే గూగుల్ ప్లే సిరివెన్నెల సాంగ్స్ అంటూ ట్రెండింగ్ సెర్చ్ ను జోడించింది.

తెలుగు సినీ సాహిత్యానికి చీకటి రోజు అంటూ సినీ పెద్దలంతా తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

 సిరివెన్నెల మరణ వార్త తెలుగు సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపడేలా చేసింది.ప్రస్తుతం ఆయన పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

Gulab Jamun Noodles : ఇదెక్కడి విచిత్రమైన ఫుడ్ కాంబో.. నూడుల్స్‌లో గులాబ్ జామున్‌..!