గూగుల్ సీఈవో ని మెప్పించిన అమెరికా అమ్మాయి...!!!

పట్టుదల , ఆత్మ విశ్వాసం తోడుగా ఉంటే సాధించలేనిది ఏది లేదు.ఈ విషయం అనేక సందర్భాలలో రుజువయ్యింది కూడా.

అయితే అమెరికాకి చెందిన ఓ అమ్మాయి తనకి క్యాన్సర్ ఉందని తెలిసినా, తాను చదువుతున్న చదువులలో వెనకపడినా పట్టుదలతో ఎంతో ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళింది.

చివరికి ఎంతో మందికి స్పూర్తివంతురాలిగా నిలిచింది.గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ సైతం నువ్వు ఎంతో స్పూర్తివంతం అంటూ ట్వీట్ చేశారు.

వివరాలోకి వెళ్తే.సరఫినా నాన్స్ అనే మహిళ ఫిజిక్స్ , కాస్మాలజి లో ఇప్పుడు నిష్ణాతురాలు కానీ సరిగ్గా నాలుగేళ్ళ క్రితం ఆమె పరిస్థితి అదే సబ్జక్టులలో సున్నా తెచ్చుకునేది.

ఎంత కృషి చేయాలనీ అనుకున్నా సరే ఆమె విఫలం అయ్యేది, చివరికి తాను చదువు మానేయాలని అనుకుని తన ప్రొఫెసర్ కి చెప్పింది.

ఈలోగానే ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తేలడంతో జీవితంలో ఏదన్నా సాధించాలని అనుకుంది. """/" /ఒక పక్క అనారోగ్యం ఉన్నా సరే పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే ఆమె బ్రతికే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో ఆమెలో మరింత ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో ఎట్టకేలకి తాను అనుకున్నది సాధించింది.

ఇదే విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ ట్వీట్ చేసిన క్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆమె గతాన్ని చదివి స్పందించారు.

సున్నా మార్కులు వచ్చినా,క్యాన్సర్ అని తెలిసినా నీ ఆత్మ విశ్వాసం కోల్పోలేదు జీవితం సున్నా కాకుండా ధైర్యంగా నిలిచావ్ రియల్లీ నువ్వు స్పూర్తివంతమైన మహిళవి అంటూ ట్వీట్ చేశారు.

ఎంతో మంది నెటిజన్లు సైతం ఆమెని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

షాకింగ్ వీడియో: అడవి పిల్లి – విష సర్పం మధ్య భీకర పోరు..