2023 సంవత్సరంలో టాప్ హీరోలు వీళ్లే.. ఏ స్టార్ హీరోకు ఏ స్థానం దక్కిందంటే?
TeluguStop.com
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి.ఎన్నో సినిమాలు విడుదల అవ్వగా అందులో కొన్ని ప్లాప్ గా నిలిస్తే మరికొన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.
మరి ఈ ఏడాది అనగా 2023 కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి.
అందులో కేవలం ఒక 25 సినిమాలు మాత్రమే అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.
మిగిలిన చిత్రాలన్నీ బాక్సాఫీస్( Box Office ) ముందు బోల్తా కొట్టాయి.మొత్తానికి ఈ ఏడాది చాలా సినిమాలు భారీ వసూళ్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాయి.
"""/" /
అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Young Rebel Star Prabhas ) అందరి కంటే పైచేయి సాధించాడు.
మరి ఆ వివరాల్లోకి వెళితే.ఈ ఏడాది పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన సలార్( Salar ) టాప్ లో నిలిచింది.
2023లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి.అందులో భారీ ఓపెనింగ్స్ సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచిన చిత్రమే సలార్.
ఈ చిత్రం ఏకంగా మొదటి రోజు రూ.178.
70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.అలాగే టాప్ 2 లో కూడా ప్రభాస్ నిలిచాడు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రెండో స్థానంలో నిలిచింది.ఈ మూవీకి టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా స్పందన వచ్చింది.
ఫలితంగా ఇది మొదటి రోజు రూ.137 కోట్లు గ్రాస్ రాబట్టి రెండో స్థానంలో నిలిచింది.
"""/" /
ఇక 2023 సంవత్సరం బాలయ్య బాబుకు( Balayya Babu ) కూడా బాగా కలిసి వచ్చింది.
ఈ సంవత్సరంలో రిలీజ్ అయి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన తెలుగు సినిమాల జాబితాలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా( Veera Simha Reddy Movie ) మూడో స్థానంలో నిలిచింది.
ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.50.
10 కోట్లు వసూలు చేసింది.తద్వారా ఈ లిస్టులో మూడో స్థానంలో చోటు దక్కించుకుంది.
అదేవిదంగా 2023వ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్ గ్రాస్‌ను వసూలు చేసిన టాలీవుడ్ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )నటించిన వాల్తేరు వీరయ్య మూవీ కూడా టాప్‌లో నిలిచింది.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.
దీంతో తెలుగులో 4వ స్థానంలోనూ, ఇండియా వైడ్‌గా 12వ స్థానంలో నిలిచింది.అలాగే ఈ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో బ్రో కూడా ఒకటి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు రూ.
48.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఫలితంగా టాలీవుడ్‌లో ఐదో స్థానంలో నిలిచింది.
శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్… తన సలహా తప్పనిసరి అంటూ?