నోకియా ఫ్యాన్స్‌కు పండ‌గ లాంటి వార్త‌!

ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ అంటే నోకియానే.ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్‌ను ఓ ఊపు ఊపేసింది.

ఎన్నో మోడల్స్‌తో మార్కెట్‌ను ముంచెత్తేది.అయితే స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత మొబైల్‌ రంగంలో నోకియా మెల్లగా సైడ్‌ అవుతూ వచ్చింది.

షియోమీలాంటి చైనా కంపెనీల ఎంట్రీతో స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో నోకియా పోటీ పడలేకపోయింది.ఇప్పుడు కూడా అడపాదడపా ఏదో ఒక మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేస్తున్నా.

అవి అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి.అయితే ఇప్పుడా నోకియా మెల్లగా స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్మార్ట్‌ టీవీ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఎప్పుడెప్పుడా అని నోకియా లవర్స్‌ ఎదురు చూస్తున్న స్మార్ట్‌ టీవీ డిసెంబర్ 5న ఇండియాలో లాంచ్‌ కాబోతోంది.

స్మార్ట్‌ టీవీ లాంచ్‌ కోసం ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌తో నోకియా చేతులు కలిపింది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/11/Good-Update-From-Nokia-For-Nokia-Customers-నోకియా-ఫ్యాన్స్‌కు-పండ‌గ-లాంటి-వార్త‌!--jpg"/అంతేకాదు తొలిసారి ఓ స్మార్ట్‌ టీవీలో జేబీఎల్‌ ఆడియో టెక్నాలజీని వాడబోతున్నారు.

ఇప్పటి వరకూ స్మార్ట్‌ టీవీల్లో ఆడియోనే అసలు సమస్య.దీంతో ఇక్కడే పైచేయి సాధించాలని ఏకంగా జేబీఎల్‌తో నోకియా చేతులు కలిపింది.

గరిష్ఠంగా 55 ఇంచుల వరకూ టీవీలను తయారు చేయాలని నోకియా భావిస్తోంది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/11/Good-Update-From-Nokia-For-Nokia-Customers-నోకియా-ఫ్యాన్స్‌కు-పండ‌గ-లాంటి-వార్త‌-1!--jpg"/ఈ టీవీల్లో క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీకి బదులుగా 4కే యూహెచ్‌డీ ప్యానెల్‌ను వాడుతున్నారు.

55 ఇంచుల మార్కెట్‌లో షియోమీ, టీసీఎల్‌, మోటొరోలా, సామ్‌సంగ్‌, ఎల్జీలాంటి కంపెనీలకు నోకియా పోటీగా నిలవనుంది.

వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, రక్తహీనతను తరిమికొట్టే బెస్ట్ జ్యూస్ ఇది.. తప్పక డైట్ లో చేర్చుకోండి!