కార్తీక మాసం మొదటిరోజు నెయ్యి దానం చేస్తే మంచిదా ?

మనదేశంలో ప్రజలు పండుగలను ఎంతో ఘనంగా సంతోషంగా ఉల్లాసంగా కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటూ ఉంటారు.

మనదేశంలో జరుపుకునే చాలా పండుగలకి ఒక్కో పండుగకి ఒక్కో రకమైన ఆచారం ఉంటుంది.

అలాంటి పండుగలలో చాలా పవిత్రమైనది.కార్తీక మాసంలోని సోమవారాలలో కార్తీక పౌర్ణమి పర్వదినాన విశేష పూజలు చేస్తూ ఉంటారు.

చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండడాన్ని కార్తీకం అని అంటారు.

కార్తీక మాసంలో ఉసిరికాయలను అసలు తినకూడదు.కార్తీక మాసం అన్ని రోజులు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి కార్తిక శుద్ధ పాడ్యమి అంటే దీపావళి అయిపోయిన తర్వాతి రోజును బలి పాడ్యమి, గోవర్ధన పూజ అని చెబుతూ ఉంటారు.

కృత్తికా నక్షత్రం అగ్ని కి సంబంధమైన నక్షత్రం.కార్తీక మాసం మొదటి రోజు అగ్నికి సంబంధించిన పూజలు చెయ్యాలి.

కార్తీక మాసం మొదటి రోజు ఆవునెయ్యిని దానం చేస్తే పుణ్యం వస్తుంది.అగ్నికి సంబంధించిన దీపారాధన చేయడం వల్ల ఆ ఇంటిపై శివుడి అనుగ్రహం లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.

"""/"/ కార్తీక మాసం అంతా ఇంట్ల ఇంట్లో దీపాలు వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

కార్తీక మాసం మొదటి రోజును బలి పాడ్యమి అని అంటారు.కార్తీక మాసం మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం వల్ల ఆ ఇంటికి ఎంతో మంచిది.

ఇలా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది.అలాంటి ఇంట్లో ప్రతిరోజు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాలను వెలిగించడం మంచిది.

అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపం ఉంచడం మంచిది.కార్తిక మాసం మొదటి రోజు దేవునికి పాయసం చేసి నైవేద్యంగా పెట్టాలని వేద పండితులు చెబుతున్నారు.

విదేశాల్లో ఉన్నత విద్య : యూకేలో మాస్టర్స్ వద్దంటోన్న భారతీయ విద్యార్ధులు, కారణమిదేనా..?