ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాలా..అయితే ఈ టిప్స్ మీకే!

నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను పొంద‌లేక నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

ప‌ని ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్‌, మాన‌సిక ఆందోళ‌న‌, ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు, లేనిపోని భ‌యాలు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

దీనిని అలాగే వదిలేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది.అందుకే తగిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్టాలంటే ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.

? అన్న విష‌యాలు ఆల‌స్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఎంత ట్రై చేసినా ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని బాధ ప‌డే వారు.

ప‌డుకోవ‌డానికి ముందు బెడ్‌పై కూర్చుని మైండ్‌లో నుంచి వేస్ట్ మెటీరియల్ అంటే పిచ్చి పిచ్చి ఆలోచ‌న‌లు, భ‌యాలు బ‌య‌ట‌కు తోసేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వ‌దిలేయాలి.

ఇలా ప‌దిహేను నుంచి ఇర‌వై సార్లు చేసి.ఆ త‌ర్వాత ప‌డుకుంటే ప్ర‌శాంతంగా నిద్ర ప‌డుతుంది.

అలాగే ఒత్తిడి నిద్ర‌ను పాడుచేయ‌డంలో ముందుంటుంది.అందువ‌ల్ల, ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే.

అంత ప్ర‌శాంతంగా నిద్ర‌పోవ‌చ్చు.చాలా మందికి ప‌గ‌టి పూట నిద్ర పోయే అల‌వాటు ఉంటుంది.

ఇలాంటి వారికి రాత్రి స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌దు.కాబ‌ట్టి, ప‌గ‌టి నిద్ర‌కు దూరంగా ఉంటే.

రాత్రి హాయిగా ప‌డుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.కొంద‌రు నిద్రించే ముందు టీ, కాఫీలు తాగుతుంటారు.

కానీ.టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ నిద్ర‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది.

అందుకే నిద్రిపోయే ముందు ఇటువంటి పానీయాల‌కు దూరంగా ఉండాలి.అలాగే ప‌డుకునే ముందు సాంగ్స్‌ విన‌డం, మంచి బుక్స్ చ‌ద‌వ‌డం చేస్తే.

మొద‌డు మ‌రియు మ‌న‌సు రెండూ ప్ర‌శాంతంగా మార‌తాయి.దాంతో మంచి నిద్ర ప‌డుతుంది.

ఇక హాయిగా నిద్రించాలంటే పడుకునే ప్రదేశం కూడా ఎంతో ముఖ్యం.అందుకే మీకు సెట్ అయ్యే బెడ్‌ను ఎంచుకోవాలి.

అల్లు అర్జున్ కేసు వాదించిన నిరంజన్ రెడ్డి ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?