శ్రీరాముడు నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే!

శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే శ్రీరామచంద్రుని అవతారం.రావణాసురుడి సంహారానికి విష్ణుమూర్తి రాముని అవతారం ఎత్తాడు.

శ్రీరామచంద్రుడు హిందువులలో ఎంతో ప్రాచుర్యం పొందిన దేవుడిగా చెప్పవచ్చు.రాముడు పితృవాక్య పరిపాలకుడు అని చెబుతారు.

ధర్మానికి, న్యాయానికి, నీతికి శ్రీరామచంద్రుడు నిలువెత్తు నిదర్శనం.అందు కోసమే చాలామంది ఆడపిల్లలు తమకు శ్రీరామచంద్రుడు లాంటి భర్త దొరకాలని భావిస్తుంటారు.

త్రేతాయుగంలో దుష్టశక్తులను చంపటానికి విష్ణుమూర్తి చైత్రమాసం నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ భూమిపై అవతరించాడు.

రాముడిని సత్యం యొక్క స్వరూపం, ఆదర్శ కొడుకు, ఆదర్శ భర్తగా చెప్పవచ్చు.కేవలం తండ్రి మాటకు విలువిచ్చి 14 సంవత్సరాలు వనవాసం చేసి ఎన్నో కష్టాలను అనుభవించిన గొప్ప త్యాగశీలి శ్రీరామచంద్రుడు.

ఇన్ని సుగుణాలున్న శ్రీరామచంద్రుని నుంచి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన విషయాలు ఇవే.అబద్ధాలు చెప్పకూడదు: శ్రీరామచంద్రుడు తన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు.

శ్రీరామ చంద్రుని నుంచి నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఇదే.ఎవరు అబద్ధాలు చెప్పకుండా నీతి నిజాయితీలతో మెలగాలని సూచిస్తుంది.

మర్యాదగా మాట్లాడటం: రాముడు తన జీవితంలో ఎప్పుడు ఎవరి పట్ల అమర్యాదగా ప్రవర్తించినది లేదు.

ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవంగా మర్యాద పూర్వకంగా పలకరించేవాడు. """/" / చిరునవ్వుతో ప్రారంభించడం: మనం ఏ పని చేసిన చిరునవ్వుతో ప్రారంభించడం వల్ల ఆ పనిలో ఉన్న కష్టం తెలియదు.

అదే విధంగా చిరునవ్వుతో ప్రారంభించిన ఆ పని ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది.

"""/" / ఇతరులకు ఇచ్చిన దానిని మరచిపోవటం: శ్రీరాముడు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం గురించి అప్పుడే మరిచిపోయేవాడు.

మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయానికి ప్రతిఫలం ఆశించకూడదని శ్రీరాముడు తెలియజేస్తున్నాడు.

మంచి పనులను ప్రస్తావించడం: సాధారణంగా మన జీవితంలో ప్రతి ఒక్కరూ మంచి చెడు పనులను చేస్తూ ఉంటాము.

కొందరు మాటిమాటికి ఇతరులు చేసిన చెడు పనులను ఎత్తి చూపుతుంటారు.కాని శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఇతరులు చేసిన చెడు కన్నా మంచి పని ఎక్కువగా తలిచేవాడు.

ఈ విషయాలన్నింటినీ రాముడు నుంచి మనం నేర్చుకోవాలి.అప్పుడే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటాము.

పెడన సభలో మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ కీలక హామీ..!!