గుడ్ న్యూస్: ఉద్యోగం కోల్పోయిన వారందరికి నిరుద్యోగ భృతి…!
TeluguStop.com

ESI చందాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఎంతో మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.


ఈ క్రమంలో వీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఇపుడు ఇలాంటి వారికి కేంద్ర కార్మిక శాఖ శుభ వార్త చెప్పింది.


అదేమిటంటే.లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ESI చందాదారులకు నిరుద్యోగ భృతి కల్పిస్తోంది కేంద్రం.
ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, వారి నెల జీతంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా కేంద్రం చెల్లించనుంది.
"అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన" పథకం కింద ఈ సాయం వారికి లభించనుందని కేంద్ర కార్మిక శాఖ తాజాగా ప్రకటించింది.
జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగుతుంది.
అంటే ఇంచుమించుగా ఓ సంవత్సర కాలం పాటు వారికి ఆసరా లభించనుంది.ఇకపోతే.
ఈ పథకం కింద గతంలో 25 శాతం నిరుద్యోగ భృతి లభించగా.దాన్ని ప్రస్తుతం 50 శాతానికి పెంచడం గమనార్హం.
అయితే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు వున్నాయి.కనీసం 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి, 78 రోజులకు తగ్గకుండా ESIC చందాదారులుగా ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
నిరుద్యోగ భృతి కింద కార్మికుడి సగటు దినసరి జీతంలో 50 శాతం సొమ్మును గరిష్ఠంగా 90 రోజుల పాటు చెల్లించనున్నారు.
లాక్ డౌన్ కారణంగా తమ ఉద్యోగాలను కోల్పోయిన కార్మికులు సమీపంలోని ESI కార్యాలయంలో సంప్రదించవచ్చు.
పోస్టులో గానీ, స్వయంగా గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుతో పాటుగా బ్యాంకు వివరాలు, ఆధార్ కాపీ, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.ఇక్కడ కొన్ని నిబంధనలను కూడా సడలించారు.
ఇంతకు మునుపు సదరు సంస్థ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపించాల్సి ఉండేది.కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునే వీలు వుంది.
న్యాచురల్ స్టార్ ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట.. ఎవరో తెలిస్తే ఒకింత షాకవ్వాల్సిందే!