భారత ఎన్నారై డాక్టర్ల...కి గుడ్ న్యూస్

అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు భారతీయుల పై ఎన్నో ఆంక్షలు పెట్టి వారిని ఎలా అమెరికా నుంచీ బయటకి పంపాలా అని ఆలోచిస్తోంది.

అందుకు తగ్గట్టుగానే వీసాలపై ఖతినమైన నిత్నయాలు తీసుకుంటూ భారతీయ ఎన్నారై లలో ఆందోళన కలిగిస్తోంది.

ఈ విషయాలు అన్నీ మనకు తెలిసినవే అయితే బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

భారత నిపులుల కోసం డాక్టర్ల కోసం తమ నిభంధనలని సడలిస్తోంది.వివరాలలోకి వెళ్తే.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ భారతీయ డాక్టర్లు, వృత్తి నిపుణుల వలసల పరిమితిని బ్రిటన్‌ సడలించనుంది.

ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య సేవల విభాగం (ఎన్‌హెచ్‌ఎస్)లో వైద్యుల కొరత నేపథ్యంలో బ్రిటన్‌ హోంశాఖ కార్యదర్శి సాజిద్‌ జావిద్‌ త్వరలో దీనిపై ఓ ప్రకటన చేయనున్నారు.

ఈ ప్రకటనతో భారత నిపుణులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారతీయులని గౌరవించడంలో బ్రిటన్ పభుత్వం ఎంతో చొరవ తీసుకుంటుంది.

భద్రతా విషయంలో సైతం రాజీ పడదు.దాంతో ఎంతో మంది నిపుణులు ఈ మధ్యకాలంలో బ్రిటన్ వైపు చూస్తున్నారు.

ప్రస్తుతం యూరోపియన్‌ యూనియన్‌ బయటి దేశాల నుంచి ఏటా 20,700 వైద్యులు, నర్సులను మాత్రమే బ్రిటన్‌లోకి అనుమతించేలా వీసాల పరిమితి అమల్లో ఉంది.

నెలవారీ పరిమితి 1,600.వృత్తి నిపుణుల కొరత నేపథ్యంలో ఈ పరిమితిని పెంచే అవకాశం ఉందని భారత సంతతి ఫిజీషియన్ల బ్రిటిష్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రమేశ్‌ మెహతా చెప్పారు.

ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?