బ్లాంకెట్లు, బెడ్‌షీట్ల విషయంలో రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
TeluguStop.com
మనలో చాల మంది ట్రైన్ జర్నీ( Train Journey ) చేయడానికి ఇష్టపడతారు.
ఇలా ప్రయాణికుల కోసం రైల్వే శాఖ మెరుగైన సౌకర్యాలు, ఉత్తమ ప్రయాణ అనుభవాన్ని కలిగించే కోసం ఎప్పడూ కూడా సహకరిస్తూనే ఉంటుంది.
ఈ క్రమంలో రైల్వే శాఖ తరచూ కొత్త వసతులు, మార్పులను ప్రవేశ పెడుతూనే ఉంటుంది.
కానీ ట్రైన్ లో పరిశుభ్రత విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తుంటాయి.ముఖ్యంగా ఏసీ బోగీల్లో బ్లాంకెట్ల( Blankets ) శుభ్రత గురించి ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదురుకుంటూ ఉంటారు.
అయితే, తాజగా రైల్వే శాఖ ఏసీ బోగీల్లో( AC Coach ) ప్రయాణించే ప్రయాణికుల కోసం బ్లాంకెట్, బెడ్‌రోల్ కిట్‌ను ఇస్తూ ఉంటారు.
రోల్ కిట్‌లో బెడ్ షీట్‌తో( Bedsheet ) పాటు దిండు కవర్లను అందిస్తారు.
దీంట్లో బెడ్ షీట్‌ను ఒకసారి ఉపయోగించగానే ఉతకనున్నట్లు రైల్వే అధికారులు తెలియచేస్తూ ఉన్నారు.
"""/" /
అలాగే బ్లాంకెట్లను ప్రస్తుతం కనీసం నెలకు ఒకసారి వాష్ చేస్తున్నామని, ఈ సమయాన్ని కాస్త 15 రోజులకు తగ్గించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
అలాగే ఒక వేళ వీలైతే ఇంకా తక్కువ సమయంలోనే శుభ్రం చేసే ప్రయత్నం చేస్తామని అన్నారు.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే బెడ్‌షీట్లను ఉతకడానికి పలు యంత్రాలను వాడుతున్నట్టు సమాచారం.
అలాగే మరోవైపు బెడ్‌రోల్ కిట్‌లో ఇక నుంచి రెండు బెడ్ షీట్లను అందచేయబోతున్నట్టు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీపీఆర్‌ఓ కపింజల్ కిశోర్ శర్మ తెలిపారు.
ఇందులో ఒకటి మాత్రం బెడ్‌పై పర్చుకోవడానికి, మరొకటి మాత్రం ప్రయాణికులు కప్పుకోవడానికి ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.
ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. """/" /
ఇక గౌహతిలోని రైల్వే లాండ్రీ( Railway Laundry ) నుంచి కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఆ ప్రాంతంలో ఇప్పటికే బ్లాంకెట్లను 15 రోజులకొకసారి ఉతకడం మొదలు పెట్టారు.ఒక బ్లాంకెట్‌ను శుభ్రం చేసే ప్రక్రియ 45-60 నిమిషాల్లో పూర్తవుతుందని అక్కడి రైల్వే ఇంజినీర్ పేర్కొన్నారు .
దాదాపు 80-90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బ్లాంకెట్‌ను ఉతుకుతారని తెలుస్తోంది.అనంతరం బ్లాంకెట్లను డ్రయ్యర్‌లో ఆరబెడతామని తెలిపారు.
మెషీన్‌లో ఉతికి, డ్రయ్యర్‌లో ఆరబెట్టి అనంతరం స్టీమ్‌తో ఇస్త్రీ చేస్తామని కూడా అన్నారు.
ఒక్కో బ్లాంకెట్ సుమారు 973 గ్రాముల వరకు బరువు ఉంటుందని, ఉతకడానికి రూ.
23.59 ఖర్చవుతుందని సమాచారం.
ఈ క్రమంలో గౌహతి లాండ్రీలో పనిచేస్తున్నవారిలో 60 శాతం ఆడవారే అని భరద్వాజ్ తెలిపారు.
పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..