వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి నయా ఫీచర్
TeluguStop.com
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ గురించి మనందరికీ తెలిసిందే.
వాట్సప్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.ప్రతిఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.
పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు ఈ యాప్ ఓపెన్ చేయకుండా ఉండరు.
ఏదోక పని కోసం చూస్తూనే ఉంటారు.ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకోడానికో.
ఫైల్స్ పంపించుకోవడానికి దీనిని ఉఫయోగిస్తూ ఉంటారు.దీంతో ప్రస్తుతం వాట్సప్ బాగా పాపులర్ అయింది.
మిగతా ఇన్ స్టంట్ యాప్ లు చాలానే ఉన్నాయి.టెలిగ్రామ్, హైక్ లాంటి చాలానే ఉన్నాయి.
కానీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నందున వాట్సప్ నే ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉన్నారు.అలాగే యూజర్లను మరింతగా పెంచుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.
యాప్ లో అనేక అప్డేట్స్‌ను తీసుకొస్తుంది.ఇప్పటికే వీడియో కాలింగ్ ఎక్కువమందితో మాట్లాడుకునేలా, ఎక్కువ సైజు గల ఫైల్స్ పంపించుకునేలా అనేక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
ఈ క్రమంలో తాజాగా వాట్సప్ మరో నూతన ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.డు నాట్ డిస్టర్చ్ ఏపీఐ అనే నయా ఫీచర్ ను ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ ద్వారా వాట్సప్ ఇన్ కమింగ్ కాల్స్ ఎందుకు మిస్ అయ్యాయో ఈజీగా తెలుసుకోవచ్చు.
ఐఓఎస్ వెర్షన్ లేటెస్ట్ బీటా ఆప్ డేట్ లో ఈ ఫీచర్ కనిపించినట్లు వాట్సప్ ట్రాకర్ వాట్సప్ బీటా ఇన్పో తెలిపింది.
మాములుగా డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అనే చేస్తే ఫోన్స్, కాల్స్ ఏమీ రావు.
అయితే డూ నాట్ డిస్టర్చ్ మోడ్ ఎనేబుల్ చేసినా సరే.కాల్స్ ఎవరైనా చేసేరా.
లేదా అనే విషయం దీని ద్వారా తెలుసుకోవచ్చు. """/"/
ప్రస్తుతం ఐఓఎస్ 15 లేదా అంతకన్నా కొత్త వెర్షన్లతో నడిచే ఐఫోన్లకు ఈ ఫీచర్ అందుబాటులో వచ్చింది.
త్వరలోనే ఐఫోన్ యూజర్లందరికీ ఈ ఫీచర్ వచ్చే అవకాశముంది.అలాగే ఏదైనా వాట్సప్ గ్రూపులో నుంచి మనం ఎగ్జిట్ అయితే లెఫ్ట్ అయినట్లు గ్రూపులోని మిగతా సభ్యులకు తెలుస్తుంది.
అయితే గ్రూపులో నుంచి బయటకు వచ్చినా లెఫ్ట్ అయినట్లు సభ్యులకు తెలియకుండా చేసేలా మరో ఆఫ్షన్ ను వాట్సప్ త్వరలో తీసుకురానుంది.
Betsson Reseña Y Reputación Del Sitio (EC)