శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ టికెట్ ఉంటే గంటలోనే దర్శనం..

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది అని చెప్పాలి.మంగళవారం రోజు శ్రీవారిని 67 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

ఇక స్వామి వారికి 22 వేల మంది భక్తులు తల నీలాలను సమర్పించగా, భక్తులు హుండీ ద్వారా కానుకల రూపంలో 5.

3 కోట్లు సమర్పించారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు లేక నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు.

ఇక ఉదయం ఏడు గంటలకు వచ్చిన సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది.

ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం మాత్రమే పడుతుంది.శ్రీవారి దేవాలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడికి కైంకర్యాలు అర్చకులు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం ప్రత్యూష కాల ఆరాధనతో దేవాలయ ద్వారాలను అర్చకులు తెరిచారు.

"""/" / బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామివారిని మేల్కొల్పారు.

ఆ తర్వాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్బార్ నిర్వహించారు.

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.

నవనీత హారతి సమర్పించిన తర్వాత శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు.ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదికలో అన్న ప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, పగిలిన కుండలో వెన్న తో కలిపిన అన్నం,దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులు గంటలోనే స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ లోయలో పడిపోయిన యువతి.. చికిత్స పొందుతూ మృతి..!