నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో 4500కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు..!!
TeluguStop.com
దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతుంది.టాప్ మోస్ట్ కంపెనీలు సైతం చెప్పా పెట్టకుండా ఉద్యోగాలు పీకేస్తున్నారు.
మరోపక్క ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలు కూడా దుకాణం సర్దేస్తున్నాయి.ఐటీ ఫీల్డ్ లో పరిస్థితి మరి చాలా దారుణంగా ఉంది.
ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లాంటి వార్త.
విషయంలోకి వెళ్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) CHSL-2022 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
దాదాపు 4500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రెటరీయాట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.
ఈరోజు నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.అర్హత ఇంటర్ పాస్ అయ్యుండాలి.
వయసు 18 నుంచి 27 ఉండాలి.టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండొచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే వెబ్సైట్ డీటెయిల్స్ Ssc.nic!--in సైట్.
విద్యుత్ వైర్లు తగిలి గడ్డి లోడు దగ్ధం