టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందింది.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్టీసీ యాజమాన్యం ఎంప్లాయిస్ కు మరో డీఏ అందించనుంది.

ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు.

ఈ మేరకు జూలై 2022 నుంచి ఇవ్వాల్సిన డీఏను జూన్ నెల వేతనంతో కలిపి చెల్లించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల కానుకగా పెండింగ్ లో ఉన్న డీఏను మంజూరు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

అసెంబ్లీ సాక్షిగా..  జగన్ ను ఇలా టార్గెట్ చేస్తున్నారా బాబు ?