మహాబలిపురం వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్.. గంటకో ఉచిత బస్సు

పర్యాటక రంగాన్ని డెవలప్ చేసేందుకుు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.పర్యాటక ప్రదేశాలను డెవపల్ చేసి పర్యాటకులను ఆకర్షించేలా కసరత్తు చేస్తున్నాయి.

దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.టూరిజంకు చాలా ప్రాధాన్యతన ఉంటుంది.

దానికంటూ ఒక శాఖ, మంత్రి కూడా ఉంటారు.ప్రముఖ ప్రదేశాలను, పురాతన ప్రదేశాలు అనేవి మనకు ఒక ఆస్తి లాంటివి.

వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.వాటిని డెవలప్ చేసి దాని ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అలాగే పర్యాటకులకు అనేక సదుపాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి.టూరిస్టులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నాయి.

అందులో భాగంగా మహాబలిపురానికి వెళ్లే పర్యాటకులకు తమిళనాడు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది.

మహాబలిపురానికి వెళ్లే ప్రయాణికులకు హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

"""/"/ మహాబలిపురంలో అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఐదు బస్సులతో టీటీడీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.

సోమవారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది.మార్గంలో మొత్తం 19 బస్ స్టాఫ్ లు ఉంటాయి.

మధ్య కైలాష్ నుంచి రాజీవ్ గాంధీ సాలై మీదుగా షోలింగనల్లూరు జంక్షన్, అక్కడ నుంచి ఈసీఆర్ మీదుగా మహాబలిపురానికి చేరుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు.

ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుందని, ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తమిళనాడు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్పష్టం చేసింది.

అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీులు పూర్తయ్యే వరకు ఈ ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

దేవరలోని ఆ సీన్స్ లో సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసిన తారక్.. అదరగొట్టారంటూ?