శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి కోట స్పెషల్ దర్శనం టికెట్ల విడుదల..!

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati )మన దేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు.

అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది.ఎందుకంటే జనవరి నెల కు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది.

జనవరి ఒకటవ తేదీ మినహా మిగతా తేదీల టికెట్లను అందుబాటులో ఉంచింది.డిసెంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ కోటా టోకెన్లను కూడా టీటీడీ విడుదల చేయలేదు.

భక్తులు Ttdevasthanams.ap.

Gov!--in వెబ్ సైట్ ద్వారా జనవరి కోటా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు అని దేవస్థానం అధికారులు ప్రకటించారు.

"""/" / భక్తులు( Devotees ) శ్రీవారిని సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ప్రతినెల టిటిడి విడుదల చేస్తూ ఉంటుంది.

ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన స్పెషల్ దర్శనం టికెట్లు మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది.

ఇప్పటికే జనవరి నెలకు సంబంధించి శ్రీవాణి భక్తుల దర్శనం టికెట్లతో పాటు వసతి టికెట్లను కూడా టీటీడీ సోమవారం విడుదల చేసింది.

తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీగా విరాళం అందజేశాడు.ఎస్.

వి అన్న ప్రసాదం ట్రస్టుకు పది లక్షల విరాళం అందించారు.గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వికాస్ కుమార్ ఇటీవల అశ్వవాహన సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి( Bhumana Karunakar Reddy ) ని కలిసి డిడిని అందజేశాడు.

అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ టిటిడి అన్న ప్రసాదం ట్రస్టుకు 9.5 టన్నుల కూరగాయలను విరాళంగా అందించారు.

"""/" / ఈ రోజు నుంచి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల( Dwaraka Tirumala ) చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి.

ఈ నెల 29 వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.ఈ నెల 26 న స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం, 27వ తేదీన రథోత్సవం నిర్వహిస్తారు.

ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం చంద్రగ్రహణం కారణంగా దేవాలయాన్ని మూసివేయనున్నారు.తిరిగి 29వ తేదీన ఉదయం దేవాలయం తెరిచి శుద్ధి చేస్తారు.

అదే రోజు రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు,పవళింపు సేవలో అశ్వయుజ మహాసభ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఈ ఉత్సవాల కారణంగా స్వామివారికి జరిగే నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ద్వారా తిరుమల అధికారులు చెబుతున్నారు.

CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?