థ్రెడ్స్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో అదిరిపోయే ఫీచర్లు..

ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ సంస్థగా( Technology ) పేరున్న మెటా కంపెనీ థ్రెడ్స్( Threads ) పేరుతో ట్విట్టర్ తరహా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఫ్లాట్‌ఫామ్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది.యూజర్లు రికార్డు స్థాయిలో వస్తున్నారు.

థ్రెడ్స్ ను ప్రారంభించిన రెండు రోజుల్లోనే లక్షల మందికిపైగా యూజర్లు వచ్చారు.అయితే ట్విట్టర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు థ్రెడ్స్ లో అనేక ఫీచర్లు ప్రవేశపెడుతున్నారు.

ప్రారంభం కావడంతో బేసిక్ వెర్షన్ ను మాత్రమే విడుదల చేశారు.అయితే త్వరలో మరిన్ని ఫీచర్లను చేర్చనున్నారు.

"""/" / ఎడిట్, ఫీడ్, హ్యాష్‌ట్యాగ్స్( Edit, Feed, Hashtags ) లాంటి అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చేందుకు థ్రెడ్స్ ప్రయత్నాలు చేస్తోంది.

ట్విట్టర్ తో పోలిస్తే థ్రెడ్స్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి.ఒక పోస్ట్ ను ఒక భాష నుంచి వేరే భాషల్లోకి అక్కడే ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు.

ఇక కొత్త హోమ్ ఫీడ్ ఫీచర్( Home Feed Feature ) ద్వారా యూజర్లు తాము ఫాలో అవుతున్న లేదా తమను ఫాలో అవుతున్నవారి పోస్టులనే కాకుండా తమ స్నేహితులు ఫాలో అవుతున్నవారి పోస్టులను కూడా చూసుకోవచ్చు.

ఇక ఎడిట్ ఆప్షన్ ను కూడా థ్రెడ్స్ ప్రవేశపెట్టనుంది.ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఏవైనా తప్పులు ఉంటే పోస్ట్ ను వెంటనే సరిదిద్దుకోవచ్చు.

ఈ ఎడిట్ బటన్ ఉచితంగా యూజర్లకు అందుబాటులో ఉండనుంది. """/" / ఇక ఇందులోని ట్రాన్స్ లేట్ ఆప్షన్( Trans Late Option ) ద్వారా ఏ భాషల్లోని పోస్ట్ నైనా సులువుగా అక్కడే ట్రాన్స్‌లేట్ చేసుకుని చదువుకోవచ్చు.

అలాగే అకౌంట్స్ స్విచ్ ఫీచర్ ను కూడా తీసుకురానున్నారు.ఈ ఫీచర్ ద్వారా వేర్వేరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం వేర్వేరు థ్రెడ్స్‌ అకౌంట్స్‌ను మెయింటైన్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

త్వరలోనే ఈ ఫీచర్లు అన్ని అప్డేట్ కానున్నాయి.

సొంత సినిమాలనే డైరెక్ట్ చేసుకుంటే వాటి పరిస్థితి ఇలాగే ఉంటుంది.