షేర్లు కొనాలనుకొనేవారికి శుభవార్త... ఒక్కో షేరుకు రెండు షేర్లు ఫ్రీ అక్కడ!

ఈ దీపావళి మిమ్మల్ని ఉత్తేజ పరచడానికి ఎన్నో, మరెన్నో ఆఫర్లను తీసుకువస్తోంది.ఓ వైపు ఆఫ్ లైన్ షాపింగులు, మరోవైపు ఆన్లైన్ షాపింగులు రకరకాల డిస్కౌంట్లతో ఆహుతులను ఊరిస్తోంది.

ఈ క్రమంలో ఓ కంపెనీ షేర్ల విషయంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది.అవును, స్మాల్ క్యాప్ కంపెనీ సిన్ బ్యాగ్స్ లిమిటెడ్ దీపావళికి ముందే పెట్టుబడిదారులని ఆకర్శించడానికి భారీ బహుమతిని ప్రకటించింది.

ఇప్పటికే మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ఈ స్టాక్.ప్రస్తుతం తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ప్రకటించడం విశేషం అని చెప్పుకోవాలి.

ఈ వార్త ఎప్పుడైతే బయటకి తెలిసిందో శనివారం స్టాక్ BSEలో ఏకంగా 5% పెరిగి రూ.

304.80 వద్ద క్లోజ్ అయింది.

రూ.10 ఫేల్ వ్యాల్యూ ఉన్న ఒక్కో షేరుకు రెండు బోనస్ షేర్లను అందిస్తున్నట్లు కంపెనీ BSEకి ఇచ్చిన సమాచారంలో తెలియజేసింది.

అయితే దీనికి సంబంధించి రికార్డు తేదీని మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించకపోవడం కొసమెరుపు.

ఇకపోతే అర్హత కలిగిన పెట్టుబడిదారులకు ఇవి అందనున్నాయి.కంపెనీ బోర్డు నిర్ణయం మేరకు ఒక్కో షేరుకు గాను రెండు బోనస్ షేర్లను అందిస్తున్నట్లు భోగట్టా.

"""/"/ ఇకపోతే గత సంవత్సరం కంపెనీ షేర్లు 100.07% ఎగబాకి పెట్టుబడి విలువ నేటికి డబుల్ అయింది.

కంపెనీలో ప్రమోటర్లు 58.66% వాటాను కలిగి ఉండగా, ఇపుడు మరింతమంది వాటాదార్లను ఆకర్శించే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఈ తాజా ప్రకటన వలన ఇన్వెస్టర్లు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం మెండుగా కనిపిస్తోంది.

కాగా 1984లో స్ఠాపించబడిన ఈ కంపెనీ నేటివరకు అజరామరంగా వెలిగిపోతోంది.ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇండోర్‌లో ఉంది.

ప్రస్తుతం కంపెనీ అంతర్జాతీయంగా.బెల్జియం, హంగేరీ, సెనెగల్, థాయిలాండ్, ఐర్లాండ్, డెన్మార్క్, USA, UK, డెన్మార్క్, ఆస్ట్రేలియా, స్పెయిన్ వంటి అనేక దేశాల మార్కెట్లో వ్యాపారం చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీ.. అనితకు గట్టిపోటీ తప్పదా?