నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక ట్విట్టర్‌లో కూడా జాబ్ ఆఫర్స్

ట్విట్టర్( Twitter ) మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది.అదే హైరింగ్ ఫీచర్.

ఈ ఫీచర్ నిరుద్యోగులతో పాటు ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే కంపెనీలకు కూడా ఉపయోగపడనుంది.

నౌకరీ, ఇన్‌డీడ్, లింక్డ్‌ఇన్ తరహాలో మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ ఫామ్ ట్విట్టర్‌లో కూడా ఇక నుంచి ఉద్యోగాల కోసం వెతుక్కోవచ్చు.

అలాగే కంపెనీలు తమ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను తెలియజేసి తద్వారా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవచ్చు.

ఇటీవల లింక్డ్‌ఇన్, ఇన్‌డీడ్ బాగా పాపులర్ అయ్యాయి.ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లోని వివిధ జాబ్ పోర్టల్స్‌లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.

ప్రస్తుతం జాబ్ పోర్టల్స్ ద్వారానే ఎక్కువమంది కంపెనీలను సంప్రదిస్తున్నారు.హెచ్ఆర్‌తో నేరుగా ఈ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా మాట్లాడుతున్నారు.

దీంతో ట్విట్టర్ కూడా తమ బ్రాండ్‌ను పెంచుకునేందుకు హైరింగ్ ఫీచర్( Twitter Hiring ) తీసుకురానుంది.

దీని ద్వారా వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ ట్విట్టర్‌లో జాబ్ నోటిఫికేషన్లు పోస్ట్ చేయవచ్చు.కంపెనీల ప్రొఫైల్ పేజ్ ఓపెన్ చేసి యూజర్లు జాబ్ వివరాల గురించి తెలుసుకోవచ్చు.

"""/" / ట్విట్టర్ లో ఎంతోమంది యూజర్లు ఉంటారు.వివిధ రంగాల్లో ఉద్యోగం చేస్తూ అనుభవం కలిగినవారు ఎంతోమంది ఉంటారు.

దీంతో మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలకు కూడా హైరింగ్ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది.

ట్విట్టర్‌ను ఎవ్రీథింగ్ ప్లాట్‌ఫామ్‌గా మార్చాలని, యూజర్లకు అన్నీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.అందులో భాగంగానే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

"""/" / గత ఏడాది మే నెలలోనే ఈ ఫీచర్ గురించి ఎలాన్ మస్క్( Elon Musk ) హింట్ ఇచ్చారు.

జాబ్ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు పరోక్షంగా చెప్పారు.అప్పటినుంచే ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు.

అతి త్వరలోనే ఈ ఫీచర్ ట్విట్టర్ లో అప్‌డేట్ కానుంది.ఈ ఫీచర్‌తో ట్విట్టర్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని ఈ కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఊరి ప్రజలు పక్షులు, జంతువుల పేర్లనే ఇంటిపేర్లుగా పెట్టుకుంటారని తెలుసా..?