ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. వైసీపీ సర్కార్ కొలువుల జాతర

ఏపీలో కొలువుల జాతర షురూ అయింది.నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన 24 గంటల వ్యవధిలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది ఏపీ చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా నిలిచిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నిరుద్యోగ యువతకు కేవలం వైసీపీ సర్కార్ హయంలో న్యాయం జరిగిందని నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు.

తాజాగా విడుదల చేసిన గ్రూప్ -1 నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీ చేయనుంది జగనన్న ప్రభుత్వం.

వీటిలొ 26 డీఎస్పీ పోస్టులతో పాటు 9 డిప్యూటీ కలెక్టర్ల ఖాళీలు సైతం భర్తీ కానున్నాయి.

అటు గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా 897 ఖాళీలను భర్తీ చేయనుంది.ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులుండగా 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ అవనున్నాయి.

అయితే సుమారు నాలుగేళ్ల జగన్ పాలన కాలంలో సుమారు 6 లక్షల 16 వేల 323 పోస్టులను భర్తీ చేయడం విశేషం.

యావత్ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా రికార్డు స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేవలం జగన్ సర్కార్ తోనే సాధ్యమైంది.

గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలను ఇవ్వలేదని కచ్చితంగా చెప్పొచ్చు.టీడీపీ హయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచిన సంగతి తెలిసిందే.

ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేసింది.సుప్రీంకోర్టు వంకతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదు.

అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రం నిబంధనలు అన్ని సడలించి సాధ్యమైనంత వరకు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది.

ఇంటికో ఉద్యోగం ఇచ్చి పేద, మధ్య తరగతి కుటుంబాలకు చేయూత అందించింది జగన్ ప్రభుత్వం.

విద్యావ్యవస్థ బాగుంటేనే సమాజం బాగుంటుంది.దాని ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నది జగన్ నమ్మకం, అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యావ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకువచ్చారు.

పేదవాని పిల్లలు కూడా పాఠశాలలకు వెళ్లి, చదువుకోవాలనే లక్ష్యంతో నాడు -నేడు నిర్వహించి రాష్ట్రంలోని ప్రతి బడిలో మౌలిక సదుపాయాలు కల్పించారు.

ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలనే ధ్యేయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యాబోధన అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

అంతేకాదు ఒక్క ప్రజారోగ్య శాఖలోనే దాదాపు యాభై నెలల వ్యవధిలోనే సుమారు 53,126 పోస్టులను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది.

ఆరు లక్షల ఉద్యోగాల్లో లక్షా 84 వేల 264 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసింది.

అలాగే 3,99,791 పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన., 19,701 పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ లో నియమించింది.

దాంతో పాటు మరో 10,143 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో 3,500 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది.

ఇదంతా చూస్తుంటే ఏపీలో ఉద్యోగ విప్లవం వచ్చిందా అనేలా ఉంది.టీడీపీ హయాంలో కేవలం వేల సంఖ్యలో మాత్రమే పోస్టులను భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు.

కానీ ఇచ్చిన మాటను తప్పని జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరున్నర లక్షల ఉద్యోగాల నియామకాలు చేసి రాష్ట్రంలోనే నూతన శకానికి నాంది పలికారు.

అంతేకాదు ఈ నాలుగున్నరేళ్ల పాలనలో 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించిన ఘనత కూడా కేవలం జగన్ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుస్తోంది.

ఉద్యోగాల వర్షం కురుస్తున్న నేపథ్యంలో జగన్ పాలనపై రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయ్యబాబోయ్.. బిర్యానీని ఇంత సులువుగా చేస్తుందేంటి ఈ ఏఐ!