దేశ ప్రజలకు శుభవార్త: మే నెలలోనే గగన్‌యాన్ ప్రయోగం షురూ?
TeluguStop.com
దేశం తొలిసారి తలపెట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టు( Gaganyan Project ) గురించి సర్వదా ఉత్కంఠత నెలకొల్పుతున్న నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించిన కీల విషయాలు కేంద్రం చెప్పడం జరిగింది.
ఇది ఎప్పుడు, ఎలా ప్రారంభం కానుంది అనే వివరాల్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించాల్సిన 4 మిషన్లలో మొదటి టెస్ట వెహికల్ మిషన్ టీవీ-డీ1 2023 మే నెలలో ఉంటుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ( Jitendra Singh )తాజాగా స్పష్టత ఇచ్చారు.
భారతదేశం మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ పేరుతో చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.
"""/" /
అన్ని ఏర్పాట్లు అనుకున్నట్టుగా విజయవంతంగా జరిగితే తొలి భారత అంతరిక్ష యాత్ర 2024లో మొదలు కానుంది.
నిజానికి ఈ యాత్రను 2021లో చేపట్టాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా ఆలస్యమైందనే సంగతి విజ్ఞులకు తెలిసినదే.
కాగా గగన్‌యాత్రకు సంబంధించిన వివరాల్ని లోక్‌సభలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు.
గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టే నాలుగు అబార్ట్ మిషనల్లో మొదటిది టెస్ట్ వెహికల్ మిషన్ టీవీ-డీ1( Test Vehicle Mission TV-D1 ).
దీనిని ఈ ఏడాది మేలో నిర్వహించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలపడం జరిగింది.
"""/" /
ఈ పరీక్ష విజయవంతమైన తరువాతే ఇతర ప్రయోగాలుంటాయని తెలుస్తోంది.ఇక టీవీ-డీ2 మానవ సహిత అంతరిక్ష యాత్రల్ని 2024 మొదటి త్రైమాసికంలో నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించి వ్యోమగాముల మొదటి విడత శిక్షణ విజయవంతంగా పూర్తయినట్టు భోగట్టా.గగన్‌యాన్ కార్యక్రమాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలే మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టింది.
ఇప్పుడు తొలిసారిగా ఇండియా చేపడుతోంది.అంతరిక్ష నౌకను భూమి నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగించి.
అక్కడి నుంచి పారాచూట్లతో క్యాప్సూల్ ద్వారా వ్యోమగాముల్ని భూమికి తీసుకురానున్నారు.
ఈ పవర్ ఫుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!