శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐదు చోట్ల మినీ అన్న ప్రసాద భవనాలు..

శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేశ నలమూలల నుంచి వస్తూ ఉంటారు వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగానే అన్న ప్రసాదాలను విజయవంతంగా అందిస్తుంది.

అయితే ప్రస్తుతం ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాలకు భక్తులు పెరిగిపోతూ ఉండడంతో ఇంకా ఇతర చోట్ల అన్న ప్రసాద భవనాలను ఏర్పాటు చేయనున్నారు.

భక్తులకు అందుబాటులో ఉండేలా వారు బస చేసే అతిధి గృహాల దగ్గరలోనే అన్నప్రసాద భవనాలను ఏర్పాటు చేస్తున్నామని దేవస్థాన అధికారులు చెబుతున్నారు.

"""/"/ పీఏసీ-4ను టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఇటివల మొదలు పెట్టారు.

పీఏసీ-4 మిని అన్నప్రసాద కేంద్రంలో రోజుకు దాదాపు 15,000 మంది అన్నదానం చేస్తున్నారు.

దీనితో పాటు మరో నాలుగు చోట్ల కూడా మొదలు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

శ్రీ పద్మావతి ప్రాంతంలో, అన్నమయ్య భవనం, నారాయణగిరి పరిధిలో ప్రస్తుతం మూసి ఉన్న సారంగి హోటల్ ఎస్ఎంసి ఏరియాలో జనతా క్యాంటీన్ లో మినీ అన్నదాన భవనాలను ఏర్పాటు చేస్తున్నారు.

"""/"/ అంతే కాకుండా శ్రీవారి మెట్టు నడక మార్గంలో వచ్చే భక్తుల కోసం కూడా ఎంబీసీ ప్రాంతంలో అన్నదాన కేంద్రాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది.

మినీ అన్న ప్రసాదం కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి తాత్కాలికంగా వసతులు ఏర్పాటు చేసి వెంటనే భక్తులను అన్నప్రసాదా పంపిణీ ప్రారంభించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.

ఈ అన్న ప్రసాద భవనాలన్నీ అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులు అన్న ప్రసాదం కోసం మాతృశ్రీ తారికొండ వెంగమాంబ అన్న ప్రసాదానికి వెళ్ళవలసిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది.

తమకు దగ్గరలో ఉన్న మినీ అన్న ప్రసాద భవనాలకు వెళ్లి ఉచితంగానే భోజనం చేసే వీలు ఉంటుంది.

షాకింగ్ వీడియో: కారు ముందు కావాలనే పడిపోయిన మహిళ.. ఈవిడ డ్రామా చూస్తే..??