తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. ఆ సేవలకు కూడా టికెట్లు అందుబాటులోకి..

మన దేశ వ్యాప్తంగా చాలా పురాతన దేవాలయాలలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ శుభవార్త చెప్పారు.

చాలా రోజుల నుంచి భక్తుల కోరిక మేరకు ఒక నెల ముందు నుంచే వర్చువల్ అర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు.

ఇందులో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, అర్జిత మహోత్సవం, ఉజ్వల్ సేవ సహస్ర సేవలకు సంబంధించిన దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి.

ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికెట్లు కూడా నాలుగు రోజుల క్రితమే ఆన్లైన్లో అందుబాటులో కి తెచ్చారు.

విడుదల చేసిన ఎనిమిది నిమిషాల లోపే 506600 టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.

అయితే డిసెంబర్ నెల టికెట్లు కూడా అక్టోబర్ నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా, వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని డిసెంబర్ నెల నుంచి మార్పు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకోవడం వల్ల కాస్త ఆలస్యం అయింది.

అయితే పద్మావతి అమ్మవారి దేవాలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.ఎందుకంటే తిరుచానూరు శ్రీ పద్మ వారి అమ్మవారి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది.

ఇందులో భాగంగానే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. """/"/ ప్రతి సంవత్సరం అమ్మవారికి కార్తిక మాసంలో ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు.

ఈ సంవత్సరం కూడా శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు ఘనంగా జరిగే అవకాశం ఉంది.

ఇందులో భాగంగానే బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

కరోనా వల్ల రెండు సంవత్సరాల తర్వాత అమ్మవారు వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది.

యువతులకు ఫ్రీగా ఫుడ్, ట్రైనింగ్‌.. వేలల్లో సంపాదించొచ్చు.. ఎక్కడంటే..??