తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..!!

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీ చేయడానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలో రుణమాఫీ ఎప్పుడేప్పుడు అవుతుందా అని చూస్తున్నా తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు.

ఈ క్రమంలో 50 వేల లోపు ఉన్న పంట రుణాలను తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి మాఫీ చేయనుంది.

విడతలవారీగా ఈ కార్యక్రమాలు చేపడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడతలో 25 వేల లోపు రుణం తీసుకున్న మూడు లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయడం జరిగింది.

అయితే నేటి నుండి 50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం సన్నద్ధమైంది.

దీంతో ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.ఇదే విషయాన్ని స్వాతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది.

దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది రైతులు రుణ విముక్తి కానున్నారు.

ఇక ఇదే తరుణంలో మిగిలిన వారికి కూడా దశలవారీగా.రుణాలను మాఫీ చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు నిన్న సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో వెల్లడించారు.

ఈ క్రమంలో తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం రూ.2005.

85 కోట్లు ఖర్చు చేస్తోంది.గతంలో రైతుబంధు మాదిరిగానే రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి పక్కా ప్లానింగ్ తో కెసిఆర్ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?