తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో కేసులు పెరిగిపోతూ ఉండటంతో తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
నైట్ కర్ఫ్యూను అమలు చేసినా గాని కరోనా కట్టడి అయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనబడ లేకపోవటంతో పాటు మరోపక్క హైకోర్టు.
కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చే రీతిలో కామెంట్లు రావటంతో రేపటి నుండి పది రోజులపాటు తెలంగాణ లో లాక్ డౌన్ అమలు చేస్తూ ఉంది.
ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు అన్ని కార్యక్రమాలు ముగించుకోవాలి అని సూచించింది.
పరిస్థితి ఇలా ఉండగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలో మందు షాపులు ఓపెన్ చేసుకోవచ్చని.
లిక్కర్ షాపులకు మినహాయింపు ఇచ్చింది.దీంతో ప్రస్తుతం రేపటినుండి లాక్డౌన్ ప్రకటన వచ్చిన నాటి నుండి మందుబాబులు షాపుల వద్ద భారీగా గుమిగూడి పరిస్థితి ఉండటంతో తాజా వార్త తో.
రిలీఫ్ అవుతున్నారు.మధ్యాహ్నం తెలంగాణ లాక్‌డౌన్ అనే వార్త వినేసరికి చాలామంది మందుబాబులు స్టాక్ భారీగా ఇంటివద్ద పెట్టుకోవాలని .
వైన్ షాపుల వద్ద కుప్పలు తెప్పలుగా క్యూ కట్టారు.అయితే మందు షాపులకు కూడా మినహాయింపు ఇవ్వటంతో.
తెలంగాణ మందుబాబులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
తండ్రి గొర్రెల కాపరి.. కొడుకు సివిల్స్ ర్యాంకర్.. ఈ వ్యక్తి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!