శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ రోజు ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల..
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.
అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు శ్రీవారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.
ఇలా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది శుభవార్త అని చెప్పాలి.ఎందుకంటే రూ.
300 ల ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు విడుదల చేసింది.
ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు తిరుమల దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 13వ తేదీ అనగా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోట టికెట్లు విడుదల చేసినట్లు టిటిడి అధికారికంగా వెల్లడించింది.
అంతే కాకుండా శ్రీవారి దేవాలయంలో బాలలాయం కార్యక్రమం వాయిదా పడడం వల్ల ఈ నెల 22 నుంచి 28 వరకు రూ.
300 ల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయలేదు. """/"/
ఈ నేపథ్యంలోనే మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లు ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో తిరుమల దేవస్థానం విడుదల చేసిన విషయం తెలిసిందే.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఎలా బుక్ చేసుకోవాలంటే, మొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
ఆ తర్వాత స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ ఎంపిక చేయాలి.మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి జెనరేట్ ఓటిపిని ఎంటర్ చేయాలి.
టికెట్ బుక్ చేసుకోవడానికి తేదీలతో కూడిన స్లాట్స్ ఓపెన్ అవుతాయి.అప్పుడు మీకు నచ్చిన తేదీని స్లాట్ చేసుకొని ఆన్లైన్లో డబ్బు చెల్లిస్తే సరిపోతుంది.
ఇవన్నీ కేవలం తిరుమల దేవస్థానం వెబ్ సైట్ లోనే చేసుకోవడం మంచిది.
ఈ లక్షణాలు ఉంటే మీ ఫోన్ హ్యక్ అయినట్లే..