శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డు ప్రసాదం ఇప్పటి నుంచి..
TeluguStop.com
తిరుమల భక్తులకు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.శ్రీవారి లడ్డు ప్రసాదం మరింత త్వరగా భక్తులకు అందేలా చర్యలు మొదలుపెట్టింది.
ఇప్పటికే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుపతి తిరుమల దేవస్థానం ఇప్పటినుంచి బ్రేక్ దర్శనాలతో పాటు ప్రసాదాల పంపిణీ పైన ప్రత్యేకంగా దృష్టిపెట్టే అవకాశం ఉంది.
తాజాగా తిరుమల లో వసతి గదుల అద్దె పెంపు వివాదాస్పదంగా మారింది. """/"/
దీనికి సంబంధించి ఈవో ధర్మారెడ్డి భక్తులకు స్పష్టతనిచ్చారు.
సామాన్య భక్తులకు కేటాయించే వసతి భవనాల అద్దె పెంచలేదని స్పష్టం చేశారు.జనవరి 1వ తేదీ నుంచి ప్రస్తుత సంక్రాంతి సెలవుల వరకు తిరుమల లో భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది.
ఇంకా చెప్పాలంటే ఈ నెల రెండవ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఇప్పుడు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు ప్రసాదం కేంద్రాలను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న లడ్డు విక్రయ కేంద్రాలు పెరుగుతున్న భక్తుల సంఖ్యలతో సరిపోడం లేదు.
"""/"/
చాలాసేపు లడ్డు కోసం వేచి ఉండాల్సి వస్తోంది.దీనివల్ల భక్తుల నుంచి వస్తున్న వినతుల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలకని నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం 50 లడ్డు కేంద్రాలు నిరంతరం ప్రసాదాలు అందిస్తున్నాయి.అయినా ఇవి సరిపోవడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.
దీనిని పరిగణలోకి తీసుకొని మరిన్ని లడ్డు కేంద్రాలు పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు మరో ముప్పై లడ్డు కేంద్రాలను అదనంగా అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
వీటిని త్వరలో మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు.గదుల అద్దె ధరలు పెంచి సామాన్యులను టీటీడీ దోపిడీ చేస్తున్నట్లు నిరూపిస్తే ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేస్తానని ఈవో ధర్మారెడ్డి సవాల్ విసిరారు.
షెన్‌జెన్ స్టేషన్‌లో మహిళ నిర్వాకం.. స్నేహితుల కోసం ఏకంగా రైలు డోర్‌నే అడ్డగించింది?