గుడ్ న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. మళ్లీ నటించేందుకు గ్రీన్ సిగ్నల్
TeluguStop.com
ప్రేమమ్( Premam ) సినిమా తో హీరోయిన్ గా సౌత్ ఆడియన్స్ ని మెప్పించిన సాయి పల్లవి తెలుగు లో ఫిదా చిత్రం తో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం తెలిసిందే.
శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) చిత్రాలు హీరోయిన్స్ కి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.
కనుక ఆయన దర్శకత్వం లో మరో సినిమా ను కూడా సాయి పల్లవి చేసింది.
సాయి పల్లవి ( Sai Pallavi )కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది.
అలాగే కంటిన్యూ అయినా బాగానే ఉండేది కానీ సాయి పల్లవి గత సంవత్సర కాలంగా కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.
తెలుగు లో ఆమె ఒక్క సినిమా కూడా ప్రస్తుతం చేయడం లేదు.వచ్చిన అవకాశాలు అన్నింటిని కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది.
ఏకంగా మూడు కోట్ల పారితోషకం ఆఫర్ చేసిన కూడా ఆమె ప్రస్తుతానికి తాను సినిమాలు చేసే మూడ్ లో లేనట్టు తిరస్కరించినట్లు ఆ మధ్య ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
"""/" /
సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరమైనట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సాయి పల్లవి తిరిగి వస్తుందని భావించారు.
సాయి పల్లవి అభిమానులు కోరుకున్నట్లుగానే ఆమె తిరిగి నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
ఇటీవల ఒక తమిళ సినిమా( Tamil Movie ) లో నటించేందుకు ఈ అమ్మడు సిగ్నల్ ఇచ్చిందట.
అంతే కాకుండా తెలుగు లో కూడా ఆమె నటించేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.
అతి త్వరలోనే తెలుగు లో ఆమె సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక సాయి పల్లవి తనకు నచ్చిన కథలు వస్తే వెంటనే సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ఆమె సన్నిహితులు అభిప్రాయం చేస్తున్నారు.
గతంలో మాదిరిగానే కమర్షియల్ చిత్రానికి దూరంగా ఉంటూ పాత్ర కు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని సాయి పల్లవి భావిస్తుంది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పటికే ఆమె మేనేజర్ కొత్త అవకాశాలను కథలను పట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడట.
కెనడాలో ఊహించని అద్భుతం.. ఆకాశం నుంచి ఊడిపడిన వింత వస్తువు.. వీడియో చూస్తే!