రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు శుభవార్త... ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది, రేటు చూసి మూర్ఛపోవద్దు!

రాయల్ ఎన్‌ఫీల్డ్.నేటి యువత కలల బుల్లెట్.

దీన్ని నడపడం యువకులు ఒక స్టేటస్ గా ఫీల్ అవుతారు.ఇక పెద్ద పెద్ద ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ కూడా దీనిని నడపడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు.

అయితే కరోనా తరువాత ఆయిల్ ధరలు బాగా పెరగడంతో పెట్రోల్ డీసెల్ వాహనాలకు కాస్త గిరాకీ తగ్గిందనే ఒప్పుకోవాలి.

ఈ నేపథ్యంలో వాహనదారులు ఎక్కువగా ఎలెక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.పలు కంపెనీలు కూడా ఎలెక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంలో బిజీ అయిపోయాయి.

కాగా ఇపుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి మార్కెట్లోకి ఓ ఎలెక్ట్రిక్ వాహనం రాబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇకపోతే బీహార్‌కి సంబంధించిన ఓ ఎలెక్ట్రిక్ వాహనాల సంస్థ 'సిల్వెలైన్' తన వెబ్‌సైట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లా కనిపించే ఓ ఎలక్ట్రిక్ బైక్‌ని అమ్మకానికి ఉంచింది.

ఇప్పటికే పలు వాహనాలు విక్రయించింది.కాగా సదరు బైక్ పేరుని 'లవ్ ప్లస్‌'గా పేర్కోవడం విశేషం.

అచ్చం రాయల్ ఎన్‌ఫీల్డ్‌లానే కనిపిస్తోన్న ఈ బైక్ ధర లక్షన్నర రూపాయలని తెలుస్తోంది.

"""/"/ ఇకపోతే రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కనుక ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి దించితే మాత్రం దాని రేటు రెండున్నర లక్షల పైనే ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా, లవ్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ కావాలంటే కేవలం 2 వేల రూపాయలతో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని సదరు సంస్థ చెబుతోంది.

ఎరుపు, నలుపు రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.చాలా సౌకర్యవంతమైన రైడ్ ఈ లవ్ ప్లస్ సొంతమని తయారీదారులు చెప్పడం గమనార్హం.

మరోపక్క, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఈ బైక్ విషయమై కాస్త అసహనానికి లోనవుతోందని వినికిడి.

ప్రపంచంలోనే ఓల్డెస్ట్ వుమన్.. ఈ జపాన్ బామ్మ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..