రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు.. ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం

ప్రభుత్వ ఉద్యోగులు( Government Employees ) తమకు 60 ఏళ్లు వచ్చే వరకు చాలా సర్వీస్ చేస్తారు.

తమ విధి నిర్వహణలో చాలా మంది ప్రజల కోసం కష్టపడతారు.అలాంటి వారు రిటైర్ అయ్యాక ఖాళీగా ఉండాల్సి వస్తోంది.

అయితే ఖాళీగా ఉండడం వారికి ఏ మాత్రం నచ్చదు.ఏదో ఒక పని చేయాలని అనిపిస్తుంది.

అంతేకాకుండా ఏ పనీ చేయకపోతే లైఫ్ బోరింగ్ అనిపిస్తుంది.అయితే కొందరు రిటైర్ అయిన తర్వాత తమకు వచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తారు.

"""/" / ఇంకొందరు సొంత ఊళ్లకు వెళ్లి సెటిల్ అవుతారు.కొందరు మాత్రం ప్రైవేట్ ఉద్యోగాలలో సైతం చేరి కష్టపడుతుంటారు.

అయితే రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తాజాగా ఓ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.అయితే ఆ ఉద్యోగాలకు మాత్రం కేవలం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

ఏడాది వ్యవధి గల ఆ ఉద్యోగానికి చాలా మంది దరఖాస్తు చేస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

"""/" / పశ్చిమ బెంగాల్( West Bengal ) లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఇటీవల అదనపు ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగానికి కేవలం రిటైర్డ్ ఉద్యోగులు మాత్రమే అర్హులు.ఈ ఉద్యోగ ప్రకటనను జిల్లా అధికార యంత్రాంగం తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

'బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ డెవలప్‌మెంట్' కింద ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.

కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది కాల వ్యవధికి ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.అవసరం అయితే ఉద్యోగ వ్యవధిని ఏడాది కంటే ఎక్కువ కాలం పొడిగించే వీలుంది.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇన్‌స్పెక్టర్ / ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ / హెడ్ క్లర్క్ / యుడి క్లర్క్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించి రిటైర్ అయిన వారు ఈ పోస్టుకు సెప్టెంబర్ 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అయితే దరఖాస్తుదారుల వయసు 64 ఏళ్లు దాటకూడదు.సెప్టెంబర్ 26వ తేదీన నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దాని ద్వారా ఉద్యోగిని ఎంపిక చేస్తారు.

అల్లు అర్జున్ బెయిల్ రద్దు ? పోలీసులు ఏం చేయబోతున్నారు ?