ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... బుల్లి తెరపై బ్లాస్ట్ కాబోతున్న రెబల్ స్టార్
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను ప్రేక్షకులు బాహుబలి తర్వాత మళ్లీ అడపా దడపా చూడటం తప్ప పూర్తి స్థాయిలో ఆయన కార్యక్రమాలు చూడలేదు.
బాహుబలి సమయంలో మీడియా ముందుకు వచ్చిన ప్రభాస్ ఆమద్య కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నాడు.
ఆ షోలో చాలా సరదాగా కరణ్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు మరోసారి బుల్లి తెరపై కనిపించబోతున్నాడు.
అయితే ఈసారి తెలుగు టాక్ షోలో ప్రభాస్ కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తెలుగు బుల్లి తెరపై సెన్షేషనల్ సక్సెస్ అయిన టాక్ షో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా.
ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.సెలబ్రెటీలెందరినో తీసుకు వచ్చి వారి లోగుట్టు విప్పిన వ్యక్తి ప్రదీప్.
ఫేవరేట్ స్టార్స్‌కు సంబంధించిన తెలియని విషయాలను జనాలకు తెలియజేసిన వ్యక్తి ప్రదీప్.అందుకే ప్రదీప్ కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా ప్రతి సీజన్ కూడా సూపర్ హిట్ అవుతూ వస్తుంది.
త్వరలో కొత్త సీజన్‌తో ప్రదీప్ సిద్దం అవుతున్నాడు. """/"/
ఇక ప్రదీప్ కొత్త సీజన్‌ను ప్రభాస్‌తో ఆరంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.
బాహుబలి తర్వాత తెలుగు మీడియా ముందుకు రాని ప్రభాస్ త్వరలో రాబోతున్న 'సాహో' చిత్రం కోసం టచ్‌లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభాస్ అభిమానులు ఈ టాక్ షోలో ప్రభాస్‌ను చూడాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు.
ఎట్టకేలకు అది సాధ్యం కాబోతుంది.ఇక ప్రభాస్‌తో ప్రదీప్ ఎలాంటి ఆటలు ఆడిస్తాడు.
ఇద్దరు కలిసి ఎంత సందడి చేస్తారు.ప్రభాస్‌కు జతగా మరెవ్వరైనా వస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు.
కన్నడ మాట్లాడితే రూ.200 లేదంటే రూ.300.. బెంగళూరు ఆటోడ్రైవర్ల విచిత్ర వైఖరి బట్టబయలు!