బరువు ఎక్కువ ఉన్నవారికి శుభవార్త.. ఇకపై బరువు తగ్గేందుకు మందు..!

ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయసులోనే అధిక బరువును కలిగి ఉండటం ఎక్కువగానే గమనిస్తున్నాం.

దీనికి కారణము శరీరానికి తగిన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం వలన అధిక మంది స్థూలకాయం కలిగి ఉంటున్నారు.

దీనికి కారణం ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా అధిక స్థూలకాయం రావడానికి అవకాశం ఏర్పడుతున్నది.

ఈ స్థూలకాయము ను తగ్గించుకోవడానికి ఎక్సర్సైజులు, డైటింగ్ పాటిస్తున్న కూడా అవి తాత్కాలికంగా వరకే పరిమితం అవుతున్నాయి.

దీని వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు.అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ స్థూలకాయులకు ఒక గొప్ప శుభవార్త తెలియజేశారు.

అది ఏమిటంటే.బరువు తగ్గడానికి చేస్తున్న బెరీయాట్రిక్ వంటి శస్త్ర చికిత్సల కంటే ఇది చాలా సురక్షిత మైనదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

బ్రిటన్ లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు టైప్ 2 డయాబెటిస్ కు వాడే సెమా బ్లూ టైడ్ మందు తో ప్రయోగాలు చేసి చివరకు మందును కనుగొన్నారు.

ఆకలిని తగ్గించడానికి వాడే ఈ రకము మందును తీసుకున్నవారు దాదాపు 20 శాతము వరకు బరువు తగ్గారు.

సుమారు 16 దేశాలలోని రెండు వేల మంది పై ఈ మందును ప్రయోగించారు.

వారానికి ఒక డోసు చొప్పున దాదాపు 60 వారాలకు పైగా ఏకధాటిగా ఈ మందును వాడి ఫలితాలు నమోదు చేశారు.

ఈ మందును తీసుకున్నవారు దాదాపు సగటున 14.9 శాతం వరకు బరువు తగ్గడం జరిగినది.

అయితే బరువు తగ్గడం శుభ పరిణామమే అయినా దీని వలన కొన్ని దుష్ఫలితాలు కూడా ఉండవచ్చు అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ మందు ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే సులభమైన మార్గము బరువు తగ్గించుకోవడానికి అధిక శ్రమ , వ్యాయామం చేయడము చాలా ఉత్తమమైన పద్ధతి అని పేర్కొంటున్నారు.

తొందరగా బరువు తగ్గాలి అంటే ఇంజక్షను తీసుకోవడము సులభమైన మార్గము అని అయితే ఈ ఇంజక్షన్ సర్జరీల కంటే చాలా సులభమైన మార్గము అని స్థూలకాయులు సంతోషపడుతున్నారు.

కథ ఎంతగానో నచ్చిన కూడా ఆ సినిమాలో నటించలేకపోయిన నటీనటులు వీరే !