విదేశీ.. వలస కార్మికులకి...గుడ్ న్యూస్
TeluguStop.com
సొంత ఊరిని విడిచి.గల్ఫ్ దేశాలలో అధిక సొమ్ము సంపాదించుకోవాలనే కోరికతో భందాలని సైతం వదులుకుని ఖతర్ వంటి దేశాలు వెళ్తూ అక్కడ జీవనం సాగిస్తున్నారు ఎంతో మంది వలస కార్మికులు, ఉద్యోగులు.
అయితే ఏజెంట్స్ ద్వారా మోసపోయి.సరైన పని దొరకక అక్కడ అరబ్బు షేక్ ల ఇళ్ళల్లో పనులు చేస్తూ కాలం వెళ్ళదీసే వారు కూడా ఉన్నారు అయితే ఈ క్రమంలోనే వారు తమ తమ ఇళ్ళకి వచ్చేయాలంటే తప్పకుండా అక్కడి యజమాని అనుమతులు కావాల్సిందే దాంతో ఎంతో మంది అక్కడ పని చేసేవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతూ చిత్ర హింసలకి గురిచేస్తూ ఉంటారు ప్రభుత్వాలు కలిపించుకుంటే గానీ వారిని విడిచి పెట్టరు.
అయితే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ పరిస్థితుల నుంచీ విముక్తి కలిపిస్తూ ఖతర్ నివాస చట్టాన్ని సవరించింది.
విదేశీ వలస కార్మికులు ఇకపై తమ యజమానుల అనుమతి లేకుండానే దేశం విడిచి వెళ్లేందుకు వీలుగా వీసా చట్టాన్ని సవరించామని ప్రకటించింది.
అయితే 2022 లో ఖతర్ వేదికగా జరగనున్న సాకర్ వరల్డ్ కప్‌కు అతిథ్య ఏర్పాట్లకు ప్రధాన అవరోధంగా మారిన కార్మికుల సమస్యను అధిగమించేందుకు ఖతర్ ఈ కొత్త చట్టాన్ని తెరపైకి తీసుకువచ్చిందని అంటున్నారు Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే కొత్తగా సవరించిన ఈ చట్టం ప్రకారం ఖతర్‌లో పనిచేసే కార్మికులు తమ యజమానుల అనుమతి లేకుండానే దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంటుంది.
ఈ విషయాన్ని డెవలప్‌మెంట్, లెబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ మంత్రి ఇస్సా అల్ నూయామి తెలిపారు.
అయితే ఖతర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెలువడుతున్నాయి.ముఖ్యంగా భారత్ నుంచీ అధికంగా వలస జీవులు రావడంతో ఎంతో మంది చట్టంలో జరిగిన ఈ మార్పుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మ బాబోయ్.. పుష్ప-2 పాటకు బామ్మ ఊర మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్..