న్యూ ఇయర్ వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
TeluguStop.com
కొత్త సంవత్సరం సమయాన హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మెట్రో సర్వీసుల సమయాన్ని పొడిగించారు.ఈ మేరకు ఇవాళ అర్థరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో రాత్రి 12.15 నిమిషాలకు మెట్రో ట్రైన్ ప్రారంభమై ఒంటిగంటకు చివరి స్టేషన్ కు చేరుకోనుంది.
మరోవైపు మద్యం సేవించి మెట్రోలో ప్రయాణించకుండా మెట్రో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే మెట్రోలోకి కనుక తాగివస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు బాధ్యతయుతంగా నడుచుకోవాలని కోరారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్14, శనివారం 2024