ఎంఆధార్ వినియోగదారులకు శుభవార్త…!?

ఎంఆధార్ యాప్‌లో ప్రతి వారం ఏదో ఒక కొత్త అప్డేట్ ని అందుబాటులోకి తెస్తున్నారు.

తాజాగా మరొక సరి కొత్త అప్డేట్ ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు.అది ఏంటంటే ఆధార్ కార్డుదారులు ఎంఆధార్ యాప్‌లో ఇక నుంచి 5 యూజర్ ప్రొఫైల్‌లను జోడించవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) తెలిపింది.

గతంలో కేవలం మూడు యూజర్ ప్రొఫైల్‌లను జోడించడానికి మాత్రమే అవకాశం ఉండేది.ఇప్పుడు మరో రెండు ప్రొఫైల్‌లను అదనంగా యాడ్ చేసుకోవచ్చని యుఐడిఎఐ వెల్లడించింది.

"""/"/ అయితే ఇందుకోసం వినియోగదారులు తాము అప్లికేషన్ లో స్టోర్ చేయదలుచుకున్న ఆధార్ కార్డు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.

ఆ తరువాత ఆధార్ కార్డుదారుల మొబైల్ నెంబర్లకు వచ్చే OTP సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ రెండు స్టెప్పులు ఫాలో అవ్వగానే ప్రొఫైల్‌ వెంటనే యాడ్ అవుతుంది.అయితే ఈ సరికొత్త ఫ్యూచర్ ని వినియోగించుకోవాలంటే ఎం ఆధార్ వినియోగదారులు తమ యొక్క అప్లికేషన్ ని ముందుగా అప్డేట్ చేసుకోవాలి.

ఈ విషయాన్ని యుఐడిఎఐ శాఖ తన అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ని ప్రోత్సహించడానికి ఎం ఆధార్ అప్లికేషన్ ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు తమ ఆధార్ డేటా ఎవరూ తస్కరించకుండా లాక్ వేసుకోవచ్చు.

అలాగే ఈ అప్లికేషన్ ద్వారా ఆధార్ కార్డ్ కి సంబంధించిన సేవలను లాక్ అన్లాక్ చేసుకోవచ్చు.

అంతేకాదు వినియోగదారులు తమ ఆధార్ ప్రొఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు.

ఈ ఎం ఆధార్ అప్లికేషన్ మొత్తం 13 భాషల్లో అందుబాటులో ఉంది.అలాగే అప్డేట్ స్టేటస్, లొకేట్ ఆధార్ కేంద్ర, డౌన్లోడ్ ఈ-ఆధార్ వంటి 35 ఆధార్ సేవలను ఎంఆధార్ అప్లికేషన్ వినియోగదారులకు అందిస్తోంది.

ఎవరి ఆధార్ కార్డు అయితే వారి మొబైల్ నెంబర్ తో లింక్ అవుతుందో వారంతా ఎం ఆధార్ కార్డు లో ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

గాజాపై ఇజ్రాయెల్ దాడి .. భారతీయుడు దుర్మరణం, ఐక్యరాజ్యసమితి దిగ్భ్రాంతి