ఇండియన్ యూజర్లకి గుడ్‌న్యూస్.. ట్విట్టర్ బ్లూ త్వరలోనే విడుదల
TeluguStop.com
ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ చాలా మార్పులు తీసుకొస్తున్నారు.ఇప్పటికే బ్లూ టిక్ మార్క్ కోసం 8 డాలర్లు చెల్లించాల్సిందిగా అతను ఒక కొత్త రూల్ తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలోనే మస్క్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఇండియన్ యూజర్లను ఖుషి చేస్తోంది.
అదేంటంటే భారతదేశంలో ఒక నెలలోపు 'ట్విట్టర్ బ్లూ' రోల్ ఔట్ అవుతుందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
ఒక ఇండియన్ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు రిప్లైగా ఆయన ఈ సమాధానం చెప్పారు.
"భారత్‌లో ట్విట్టర్ బ్లూ రోల్ ఔట్‌ను మనం ఎప్పుడు ప్రారంభిస్తాం?" అని మస్క్ అకౌంట్ ట్యాగ్ చేస్తూ అడిగారు.
దానికి సమాధానంగా."హోప్ ఫుల్లీ , ఒక నెల కన్నా తక్కువ" అని మస్క్ ఇచ్చారు.
అంటే అతి త్వరలోనే ట్విట్టర్ బ్లూ ఇండియాలో లాంచ్ కాబోతోందని స్పష్టం అయింది.
యాడ్ ఫ్రీ ఆర్టికల్స్, రీడర్ థ్రెడ్, బుక్ మార్క్ ఫోల్డర్స్, కస్టమ్ నావిగేషన్ సహా ఇతర మెరుగైన ఫీచర్లతో పాటు ట్వీట్‌ను అన్‌డు చేసే ఫీచర్ కూడా ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ అయిన ప్లాన్ 'ట్విట్టర్ బ్లూ' అందుబాటులో ఉంది.
"""/"/
వెరిఫికేషన్‌తో కూడిన ట్విట్టర్ బ్లూ ప్రస్తుతం యూఎస్ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలోని ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది.
ట్విట్టర్ బ్లూ యూజర్లకు మొదటగా ఎడిట్ బటన్ తీసుకొస్తామని ట్విట్టర్ ఇంతకుముందే ప్రకటించింది.
దీన్నిబట్టి ఎడిట్ బటన్ రిలీజ్ అవ్వగానే యాక్సెస్ చేసే అవకాశం ఇండియన్ యూజర్లకు లభిస్తుందని చెప్పొచ్చు.
ఇకపోతే మస్క్ ఇండియన్ ఉద్యోగుల్లో దాదాపు అందరినీ తీసేసినట్టు సమాచారం.
అల్లు అర్జున్ లో ఆ వేదన ఉంది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!