రైతులకు శుభవార్త: భూసార పరీక్ష కిట్టు వచ్చేసిందోచ్.. ధర రూ.4500 లే..

భారతదేశంలో చాలా కాలం నుండి భూసార పరీక్ష కోసం రైతులు నానా తంటాలు పడేవారు.

భూమిలో ఎంత సారముందో, వేసే పంట కు అది ఎంత మాత్రం దిగుబడినిస్తుందో తెలుసుకోవాలంటే భూసార పరీక్ష చేసుకోవాల్సిందే.

రైతులు భూసార పరీక్ష కోసం తమ పొలంలోని మట్టిని సేకరించి పరీక్ష కేంద్రాల అధికారులకు అందజేస్తే దాన్ని ల్యాబ్లో పరీక్ష చేసి ఫలితాన్ని అందజేస్తారు.

అలా భూ సార పరీక్ష కోసం ఇచ్చిన మట్టి నుండి ఫలితాలు రావాలంటే చాలా రోజులు పట్టేవి.

ఈ నేపథ్యంలో మన దేశంలోనే చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన ఇందిరా గాంధీ కృషి విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు అధునాతనమైన భూసార పరీక్ష చేసే యంత్రాన్ని కనిపెట్టాడు మనదేశ రైతులకు ఎంతో ఆనందదాయకం.

రైతులే సులభంగా, వారే స్వయంగా భూసార పరీక్షలు నిర్వహించుకో గలిగేలా, శాస్త్రవేత్తలు ఈ భూసార కిట్టు ను తయారు చేశారు.

ఇది రైతులకు ఎంతో మేలు చేసే విధంగా, సులభంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లే విధంగా ఉండడం ఈ కిట్ యొక్క ప్రత్యేకత.

ఒక కిట్టు తో 25 శాంపిళ్లను పరీక్ష నిర్వహించుకోవచ్చు అని, దీని ధర కేవలం రూ .

4000 నుండి రూ .4,500 వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

ఆరోగ్యానికి అండంగా ఉండే బిర్యానీ ఆకు టీ.. రోజుకో క‌ప్పు తాగితే ఏం జ‌రుగుతుంది?