సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్.. మరో మూడేళ్ళ పాటు మిస్టర్ కూల్..!

వచ్చే ఏడాది ఐపీఎల్‌ 2022 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే వచ్చే సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్ ఈవెంట్లో పది జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

అంటే నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ మరింత ఘనంగా జరగనుంది.లక్నో, అహ్మదాబాద్‌ జట్లు వచ్చే ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి డిసెంబర్‌లో మెగా వేలం కూడా నిర్వహించనున్నారు.కాగా ఇక మెగా వేలానికి అంతా సిద్ధమవుతున్న క్రమంలో ఏ ఫ్రాంఛైజీ ఏ ఆటగాడిని రీటైన్‌ చేసుకుంటుంది అని.

? కొత్త జట్ల కెప్టెన్లుగా ఎవరు ఉండబోతున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.దానికంటే ముందు ఈనెల 30 నాటికి ప్రస్తుత జట్లు తమ ఆటగాళ్ల వివరాలు సమర్పించాలని ఆయా ఫ్రాంఛైజీల నిర్వాహకులు తెలిపారు.

ఈ క్రమంలోనే ధోనీ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పారని చెప్పాలి.ఎందుకంటే చెన్నై టీమ్ తమ రధసారథి అయిన మహేంద్రసింగ్‌ ధోనీని మరో మూడేళ్లు పాటు అంట్టిపెట్టుకుంటోందనే వార్తలు వెలువడుతున్నాయి.

అంతేకాకుండా రుతురాజ్‌ గైక్వాడ్‌, రవీంద్ర జడేజాతో పాటు ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్లు మొయిన్‌ అలీ లేదా సామ్‌ కరన్‌ లలో ఒకరిని తమ టీమ్ లో ఉంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అలాగే ముంబయి ఇండియన్స్‌ జట్టు కెప్టెన్ రోహిత్‌, పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాతో పాటు యువ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ లేదా సూర్యకుమార్‌లను అంట్టిపెట్టుకోవాలని భావిస్తోంది.

/br """/"/ ఈ ఏడాది కొత్తగా చేరిన జట్లలో సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ లఖ్‌నవూ ఫ్రాంఛైజీని చేజిక్కించుకోగా, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది.

ఈ విషయాలపై క్లారిటీ రావాలనుంటే ఈ నెల 30 దాక వేచి చుడాలిసిందే.

ధోనీ నిజంగానే మూడేళ్ళ పాటు చెన్నై టీమ్ ను అంటిపెట్టుకుని ఉంటారా.? ఉండరా.

? అనే విషయంపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఒకవేళ నిజంగానే తాము ఎంతగానో అభిమానించే ధోనీ మూడేళ్ళ పాటు చెన్నై రాధాసరిదిగా కొనసాగితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు లేవు అనే చెప్పాలి.

Purandhveswari : ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి..: పురంధ్వేశ్వరి