‘బోట్’ బ్రాండ్ ప్రేమికులకు శుభవార్త… స్మార్ట్‌వాచ్ ‘వేవ్ ఆర్మర్’ లాంచ్ అయిందోచ్!

బోట్ బ్రాండ్( BoAt Brand ) గురించి తెలియని యువత దాదాపుగా ఉందనే వుండరు.

దేశీయ ఆడియో బ్రాండ్‌గా మంచి గుర్తింపు పొందిన బోట్ సరసమైన ధరలకు పెట్టింది పేరు.

ఈ బ్రాండ్ నుండి ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను మార్కెట్లోకి తీసుకొస్తుంది.

ఇటీవల కాలంలో ఈ కంపెనీ ప్రొడక్ట్స్‌కు భారత్‌లో మంచి డిమాండ్ పెరుగుతోంది.ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచెస్ డిమాండ్ బాగా ఉండడంతో మార్కెట్‌ను మరింత విస్తరించే ప్లాన్‌లో భాగంగా బోట్ సంస్థ వరుసగా స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తోంది.

"""/" / తాజాగా బోట్ రగెడ్ స్మార్ట్‌వాచ్ ‘బోట్ వేవ్ ఆర్మర్( Wave Armour )’ను రిలీజ్ చేసింది.

ఈ స్మార్ట్‌వాచ్ ధర, స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.ఇది డిజైన్ పరంగా యాపిల్ వాచ్ ఆల్ట్రా‌( Apple Watch Ultra )ను పోలి ఉండడం యాదృశ్చికం అని అనుకోవాలి.

ఈ స్మార్ట్‌వాచ్ బాడీని జింక్ అల్లాయ్‌బిల్ట్ చేశారు.IP68 డస్ట్, స్వెట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

1.83 అంగుళాల HD డిస్‌ప్లే, 550 నిట్స్ మ్యాగ్జిమం బ్రైట్‌నెస్, 240 X 284 పిక్సెల్స్ రిజల్యూషన్‌‌ను కలిగి ఉంటుంది.

మండుటెండలో కూడా వాచ్ స్పష్టంగా కనిపిస్తుంది.అంతేకాకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ స్మార్ట్‌వాచ్‌ను ధరించవచ్చు.

"""/" / SpO2, హార్ట్ బీట్ రేటు, డైలీ యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ అండ్ సెడెంటరీ అలర్ట్‌ వంటి ట్రాకింగ్ ఫీచర్స్‌తో వస్తుంది.

దీంట్లో మైక్, స్పీకర్ ఇన్- బిల్ట్‌ ఉంటాయి.ఇది బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

గరిష్టంగా 10 కాంటాక్ట్‌లను సేవ్ చేస్తుంది.100 కంటే ఎక్కువ వాచ్ ఫేసెస్‌ను కంపెనీ దీంట్లో ఇం‌టిగ్రేట్ చేసింది.

ఇది క్రికెట్, హైకింగ్‌ సహా మొత్తం 20కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అందిస్తుంది.

ఇకపోతే బ్లూటూత్ కాలింగ్‌ను నిరంతరయంగా ఉపయోగిస్తే బ్యాటరీ లైఫ్ కేవలం రెండు రోజులు మాత్రమే వస్తుంది.

అంటే ఛార్జింగ్ పెట్టిన 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.బోట్ వేవ్ ఆర్మర్ స్మార్ట్‌వాచ్‌‌ను అమెజాన్ , బోట్ ఇ-స్టోర్ ద్వారా కంపెనీ విక్రయించనుంది.

టీడీపీకి ఈసీ లొంగిపోయింది..: పేర్ని నాని