ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. హెల్త్, ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేక యాప్

ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ ఉంటుంది.అయితే ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఆరోగ్యం కోసం టైమ్ కేటాయించలేకపోతున్నారు.

ఏం తింటున్నారో, ఎలాంటి జీవన శైలి పాటిస్తున్నారో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు.

జంక్ ఫుడ్ తింటూ, ఇంటి ఫుడ్డుకు దూరమై చాలా ఇబ్బందులు పడుతున్నారు.అధిక బరువు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యల కారణంగా ఎన్నో అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు.

ఈ తరుణంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ అందించింది.

కొత్తగా గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.దీనిలో ఉండే ఎన్నో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

"""/"/ ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీని అన్ని పనులకూ అన్వయించుకుంటున్నారు.ఈ క్రమంలో హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకునేందుకు గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్ ఉపయోగపడుతుంది.

ఇది ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇందులో పది కంటే ఎక్కువ ఆరోగ్యం, ఫిట్ నెస్‌కు సంబంధించిన యాప్‌లు ఉంటాయి.

Fitbit, Samsung Health, MyFitnessPal, Peloton, Oura, Flo, Lifesum, మొదలైనవి అన్నీ ఇందులో ఉంటాయి.

Google, Samsung సంస్థలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి.Google Health Connect యాప్ బీటా వెర్షన్ 3 ఎంబీ పరిమాణంలో మాత్రమే ఉంటుంది.

స్మార్ట్‌వాచ్‌లు మరియు ఫిట్‌నెస్ ట్రాకర్‌ల వినియోగదారులు వివిధ ఆరోగ్య సంబంధిత సూచికలను కొలవడానికి వివిధ రకాల యాప్‌లపై ఆధారపడతారు.

ఈ పరిస్థితిలో Health Connect యాప్ ఉపయోగపడుతుంది.ఇది వారి ఆరోగ్య డేటాను నిర్వహించడానికి వివిధ అప్లికేషన్‌లపై వినియోగదారుల ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.

ఇది Android పరికరాల మధ్య ఆరోగ్యం, ఫిట్‌నెస్ సమాచారాన్ని భాగస్వామ్యం చేసి అందిస్తుంది.

ఇందులో హృదయ స్పందన రేటు, నిద్ర, శరీరంలో తగ్గిన కేలరీలు వంటి ఎన్నో అంశాలు ఉంటాయి.

ఈ యాప్‌లో సేవ్ అయిన సమాచారం మొత్తం ఏ సమయంలోనైనా మనం తొలగించుకోవచ్చు.

ఆ హీరోయిన్ నా ఫ్రెండ్ .. ఒక్క మాటతో ఫ్యాన్స్ ని తన వైపుకు తిప్పుకున్న బిగ్ బాస్ ప్రేరణ!