గుడ్ మార్నింగ్ సీఎం సార్ ! బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు

ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో జనసేన పార్టీ గతంతో పోలిస్తే బాగా యాక్టివ్ అయింది.

ముఖ్యంగా ప్రజలు ఏ విషయంలో అయితే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారో గుర్తించి , ఆ విషయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టి హైలెట్ అయ్యేందుకు జనసేన పార్టీ ప్రయత్నిస్తోంది .

దీనిలో భాగంగానే ఏపీలో అధ్వానంగా ఉన్న రోడ్ల వ్యవహారంపై జనసేన దృష్టి పెట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా అద్వానంగా ఉన్న రోడ్ల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ట్యాగ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో అంటూ సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నారు.

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో నిరసన కార్యక్రమాలు  చేస్తున్నారు.

  ఏపీ ప్రభుత్వం రోడ్ల పరిస్థితిని మెరుగుపరిచే వరకు ఇదే విధంగా తాము వ్యవహరిస్తామని జనసేన ప్రకటించింది.

ప్రస్తుతం సోషల్ మీడియా లో జనసేన క్యాంపెయిన్ ట్రెండింగ్ లో ఉంది.ఈ వ్యవహారంతో వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమానికి పోటీగా బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు పేరుతో కౌంటర్ ఇస్తూ , ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వేసిన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ ఫోటోలకు బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు అనే హ్యష్ ట్యాగ్ జత చేస్తూ ఉండడం తో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం '' గుడ్ మార్నింగ్ సీఎం సార్'' " బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు ''  హ్యాష్ టాగ్స్ వైరల్ అవుతున్నాయి.

గత టిడిపి హయాంలో వేసిన రోడ్లు అప్పుడే మరమ్మత్తులకు గురయ్యాయని, పదేళ్లు ఉండాల్సిన రోడ్లు గుంతలు పడడానికి కారణం అవినీతేనని,  టిడిపి హయంలో రోడ్లు నాసిరకంగా వేయడమే దీనికి కారణం అని,  దీనిపై జనసేన ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు.

చంద్రబాబు హయాంలో ఇంతకంటే దారుణంగా రోడ్ల పరిస్థితి ఉన్నా,  అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదో చెప్పాలి అంటూ వైసిపి నాయకులు నిలదీస్తున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైసిపి జనసేన నాయకులు మధ్య కౌంటర్లు కొనసాగుతున్నాయి.

స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ సూపర్ ప్యాక్ ను తప్పక ట్రై చేయండి!